Site icon vidhaatha

TGSRTC | 8, 9 తేదీల్లో చేప ప్ర‌సాదం పంపిణీ.. 130 ప్ర‌త్యేక బ‌స్సులు న‌డ‌ప‌నున్న ఆర్టీసీ

హైద‌రాబాద్ : ప్ర‌తి ఏడాది మృగ‌శిక కార్తె సంద‌ర్భంగా అస్త‌మా రోగుల‌కు బ‌త్తిని కుటుంబ స‌భ్యులు చేప ప్ర‌సాదం పంపిణీ చేస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈ నేప‌థ్యంలో శ‌ని, ఆదివారాల్లో చేప ప్ర‌సాదం పంపిణీకి నాంప‌ల్లి ఎగ్జిబిష‌న్ గ్రౌండ్‌లో ఏర్పాట్లు పూర్తి చేశారు. చేప ప్ర‌సాదం కోసం తెలంగాణ‌తో పాటు పొరుగు రాష్ట్రాలు ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, ఛ‌త్తీస్‌గ‌ఢ్‌, క‌ర్ణాట‌క‌, మ‌హారాష్ట్ర‌తో పాటు ఇత‌ర దేశాల నుంచి కూడా హైద‌రాబాద్‌కు త‌ర‌లివ‌స్తున్నారు. ఈ క్ర‌మంలో చేప ప్ర‌సాదం కోసం వ‌స్తున్న వారిని దృష్టిలో ఉంచుకుని టీజీఎస్ ఆర్టీసీ ప్ర‌త్యేక బ‌స్సులు న‌డ‌పాల‌ని నిర్ణ‌యించింది. 8, 9 తేదీల్లో 130 ప్ర‌త్యేక బ‌స్సుల‌ను ఆర్టీసీ న‌డ‌ప‌నుంది.

ప్ర‌ధానంగా సికింద్రాబాద్ రైల్వే స్టేష‌న్‌, ఎంజీబీఎస్, జేబీఎస్, శంషాబాద్ ఎయిర్‌పోర్టు నుంచి 30 బ‌స్సులు, న‌గ‌రంలోని ప్ర‌ధాన ప్రాంతాల నుంచి 80 బ‌స్సులు న‌డ‌పాల‌ని ఆర్టీసీ నిర్ణ‌యించింది.

సికింద్రాబాద్ రైల్వే స్టేష‌న్ – 9
జేబీఎస్ – 9
ఎంజీబీఎస్ – 9
ఈసీఐఎల్ ఎక్స్ రోడ్డు – 9
శంషాబాద్ ఎయిర్‌పోర్టు – 7

దిల్‌సుఖ్‌న‌గ‌ర్ – 7
ఎన్జీవోస్ కాల‌నీ – 7
మిథాని – 7
ఉప్ప‌ల్ – 7
చార్మినార్ – 5
గొల్కోండ – 5
రామ్‌న‌గ‌ర్ – 5
రాజేంద్ర‌న‌గ‌ర్ – 7
రిసాల‌బ‌జార్ – 5
ఈసీఐఎల్ ఎక్స్ రోడ్స్ – 5
ప‌టాన్‌చెరు – 5
కేపీహెచ్‌బీ కాల‌నీ – 5 
గ‌చ్చిబౌలి – 5

Exit mobile version