విధాత, హైదరాబాద్ : ప్రజా ప్రభుత్వం చేసే ప్రతి నిర్ణయంలో…రైతు సంక్షేమ కోణం ఉంటుందని ఇది రైతన్నకు మీ రేవంతన్న మాట అని సీఎం రేవంత్‌రెడ్డి ట్విటర్ వేదికగా రైతు రుణమాఫీపై ట్వీట్ చేశారు. అన్నం పెట్టే రైతును అప్పుల ఊబి నుండి…
ఆశల సాగు క్షేత్రం వైపు నడిపించే ఒక బృహత్తర సాహసం “రైతు రుణమాఫీ పథకం” అని పేర్కోన్నారు. నాడు
మన్మోహన్ సింగ్ సారథ్యంలో దేశ రైతాంగానికైనా…నేడు ప్రజా ప్రభుత్వం పాలనలో రాష్ట్ర రైతాంగానికైనా…ఎంత కష్టమైనా…ఎంత భారమైనా… ఏకకాలంలో రుణమాఫీ చేసిన…చేస్తోన్న ఘనత కాంగ్రెస్ పార్టీదేనని స్పష్టం చేశారు. రాహుల్ గాంధీ ఇచ్చిన మాటకు కట్టుబడి పంద్రాగస్టు లోపు రూ.2 లక్షల రుణమాఫీ అమలు కార్యాచరణలో తొలి అడుగు కేబినెట్ ఆమోదం కాగా…
మలి అడుగు విధివిధానాల ఖరారు అని తెలిపారు. ప్రజా ప్రభుత్వం తీసుకునే ప్రతి నిర్ణయంలోనూ రైతు సంక్షేమం కోణం ఉంటుందని స్పష్టం చేశారు.
C.M REVANTH REDDY | రైతు సంక్షేమ కోణంలోనే ప్రభుత్వ నిర్ణయం,పంద్రాగస్టులోగా రైతు రుణమాఫీ … రైతన్నకు రేవంతన్న మాట
ప్రజా ప్రభుత్వం చేసే ప్రతి నిర్ణయంలో…రైతు సంక్షేమ కోణం ఉంటుందని ఇది రైతన్నకు మీ రేవంతన్న మాట అని సీఎం రేవంత్‌రెడ్డి ట్విటర్ వేదికగా రైతు రుణమాఫీపై ట్వీట్ చేశారు.

Latest News
కష్టాలను తల్చుకుని బాధపడుతున్నారా? ఈ వార్త చదివితే మీ దృక్కోణం మారిపోతుంది!
సనాతన ధర్మంలో "భూతశుద్ధి వివాహం" ఉందా?
ఇండిగో సంస్థకే ఎందుకీ కష్టాలు?
ప్రభుత్వాన్ని ఇండిగో ‘బ్లాక్మెయిల్’ చేసిందా?
గోదావరిలో తప్పిన ప్రమాదం...నది మధ్యలో ఆగిన బోటు
యాషెస్ రెండో టెస్టులో అస్ట్రేలియా ఘన విజయం
నేను చీటర్ ను కాదు : పెళ్లి రద్దుపై పలాశ్
ఔట్‌సోర్సింగ్‌పై సర్కార్ మడత పేచీ.. 4.95 లక్షల మంది ఉద్యోగులతో చెలగాటం!
భయపెడుతున్న మాజీ సర్పంచ్ ..గాలిలోకి నిమ్మకాయ వీడియో వైరల్
ఓర్నీ..మనిషిలా తొండ రెండుకాళ్లతో పరుగు..వైరల్ వీడియో