Site icon vidhaatha

తెలుగు రాష్ట్రాల సీఎంల భేటీ గొప్ప ముందడుగు … మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు ట్వీట్‌

విధాత, హైదరాబాద్ : పదేళ్లుగా పెండింగ్‌లో ఉన్న రాష్ట్ర విభజన సమస్యల పరిష్కారం కోసం తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబుల భేటీకావడం ఒక మంచి గొప్ప ముందడుగు అని మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు అన్నారు. ఈ మేరకు ఎక్స్ (ట్విట్టర్) వేదికగా ఆయన ట్వీట్ చేశారు.“రెండు తెలుగు రాష్ట్రాల మధ్య అపరిష్కృతంగా ఉన్న అన్ని అంశాల పరిష్కారమే లక్ష్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి భేటీ కావడం ఒక మంచి ముందడుగు.. రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఇదే స్ఫూర్తితో ముందుకు సాగి ఉభయ రాష్ట్రాల మధ్య అపరిష్కృత అంశాలపై వీలైనంత త్వరలో అంగీకారానికి వస్తారని ఆశిస్తున్నాను” అని ట్వీట్ చేశారు. తన ట్వీట్‌కు ప్రజా భవన్‌లో చంద్రబాబుకు సీఎం రేవంత్ రెడ్డి స్వాగతం పలికిన ఫొటోను ట్యాగ్ చేశారు. తెలుగు రాష్ట్రాల సీఎంల భేటీని కాంగ్రెస్‌, సీపీఐ, టీడీపీ, బీజేపీ, జనసేన, టీజేఎస్‌లు అభినందిస్తుండగా, వైసీపీ, బీఆరెస్‌లు భేటీపై సందేహాలు లేవనెత్తాయి.

Exit mobile version