పార్లమెంట్ ఎన్నికలలో ఇండియా కూటమిదే విజయం

వరంగల్, మహబూబాబాద్ పార్లమెంట్ స్థానాలకు జరిగిన ఎన్నికలలో వామపక్షాల మద్దతుతో పోటీ చేసిన ఇండియా కూటమి అభ్యర్థులు భారీ మెజారిటీతో విజయం సాధించబోతున్నారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు తక్కళ్లపల్లి శ్రీనివాస రావు అన్నారు.

  • Publish Date - May 14, 2024 / 04:16 PM IST

నియంతృత్వం, మతోన్మాద శక్తులకు చోటు లేదని నిరూపించారు

సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు తక్కళ్లపల్లి శ్రీనివాస రావు

విధాత, వరంగల్ ప్రతినిధి: వరంగల్, మహబూబాబాద్ పార్లమెంట్ స్థానాలకు జరిగిన ఎన్నికలలో వామపక్షాల మద్దతుతో పోటీ చేసిన ఇండియా కూటమి అభ్యర్థులు భారీ మెజారిటీతో విజయం సాధించబోతున్నారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు తక్కళ్లపల్లి శ్రీనివాస రావు అన్నారు. మంగళవారం హనుమకొండలోని సీపీఐ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ
ఈ ఎన్నికలు ప్రజాస్వామ్య వాదులకు, మతోన్మాదులకు మద్య జరిగాయని అన్నారు.

విప్లవాలకు,వామపక్ష శక్తులకు నిలయమైన ఉమ్మడి వరంగల్ జిల్లాలో మతోన్మాదులకు చోటు లేదని ప్రజలు మరోసారి నిరూపించారని అన్నారు. ప్రజల అభివృద్ధి పట్టించుకోకుండా, యువకులకు, మహిళలకు, విద్యార్థులకు, రైతులకు ఏం చేశారో చెప్పకుండా కేవలం మతం, కులం పేరుతో ప్రజలను రెచ్చగొట్టి ఓట్లు దండుకోవాలని చూసే వారికి ఈ ఎన్నికలు ఒక గుణపాఠం అని అన్నారు.

విభజన హామీలపట్ల మోసం

ఉమ్మడి వరంగల్ జిల్లాకు రావాల్సిన విభజన హామీలైన కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ, బయ్యారం ఉక్కు పరిశ్రమ, పారిశ్రామిక కారిడార్ లాంటి హామీలు అమలు చేయకుండా బీజేపీ మోసం చేసిందని శ్రీనివాస్ అన్నారు. ప్రజాస్వామ్య పరిరక్షణ, రాజ్యాంగ రక్షణ కోసం, నియంతృత్వాన్ని ఓడించాలని ఓటు వేసిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలిపారు. ఈ విలేఖరుల సమావేశంలో సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు నేదునూరి జ్యోతి, జిల్లా కార్యదర్శి కర్రె బిక్షపతి, జిల్లా మాజీ కార్యదర్శి సిరబోయిన కర్ణాకర్, రాష్ట్ర సమితి సభ్యులు ఆదరి శ్రీనివాస్, మండ సదాలక్ష్మి, జిల్లా సహాయ కార్యదర్శి మద్దెల ఎల్లేష్, నాయకులు వేల్పుల సారంగపాణి, ఏశబోయిన శ్రీనివాస్, బాషబోయిన సంతోష్, బత్తిని సదానందం తదితరులు పాల్గొన్నారు.

Latest News