Congress | కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు అప్రమంతంగా ఉండాలి: టీపీసీసీ ఎలక్షన్ కమిషన్ కో-ఆర్డినేషన్ కమిటీ

కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు అప్రమంతంగా ఉండాలని టీపీసీసీ ఎలక్షన్ కమిషన్ కో-ఆర్డినేషన్ కమిటీ చైర్మన్ పులిపాటి రాజేష్ కుమార్ అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో గ్రామ పంచాయతీలకు సంబంధించి రిజర్వేషన్స్ ఖరారు చేయడానికి పంచాయతీ రాజ్ మార్గదర్శకాలు G. O. 46 ద్వారా విడుదల చేసినట్లు తెలిపారు.

హైదరాబాద్, విధాత:

కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు అప్రమంతంగా ఉండాలని టీపీసీసీ ఎలక్షన్ కమిషన్ కో-ఆర్డినేషన్ కమిటీ చైర్మన్ పులిపాటి రాజేష్ కుమార్ అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో గ్రామ పంచాయతీలకు సంబంధించి రిజర్వేషన్స్ ఖరారు చేయడానికి పంచాయతీ రాజ్ మార్గదర్శకాలు G. O. 46 ద్వారా విడుదల చేసినట్లు తెలిపారు. అలాగే రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు జిల్లాలలో ప్రతి వార్డ్ ఆఫీసులలో నూతన ఓటర్లు లిస్ట్ ప్రచురించరితమైనదని చెప్పారు. ప్రతి గ్రామాలలో ఉన్న కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు ఈ ఓటర్ లిస్ట్ సరిగ్గా ఉన్నాయా లేదా సరిచూసుకోవాలని సూచించారు. దేశమంతటా ఓటు చోరీ గురుంచి చర్చలు జరుగుతున్న సమయంలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు ఎలాంటి పొరపాట్లు జరగకుండా నిరంతరం అప్రమంతంగా ఉండి చూసుకోవాలన్నారు. అలాగే రిజర్వేషన్స్ ఖరారులో కూడా ఎటువంటి లోపాలు జరగకుండా కాంగ్రెస్ నాయకులు అప్రమత్తంగా ఉండాలని పులిపాటి రాజేష్ కుమార్ సూచించారు.

Latest News