తుక్కుగూడ‌లో కాంగ్రెస్ బ‌హిరంగ స‌భ‌.. హైద‌రాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్ష‌లు..!

లోక్‌స‌భ ఎన్నిక‌ల నేప‌థ్యంలో కాంగ్రెస్ పార్టీ జ‌న జాత‌ర పేరిట తుక్కుగూడ‌లో శ‌నివారం సాయంత్రం భారీ బ‌హిరంగ స‌భ నిర్వ‌హించనుంది. బ‌హిరంగ స‌భ నేప‌థ్యంలో న‌గ‌ర శివార్ల‌లో పోలీసులు ట్రాఫిక్ ఆంక్ష‌లు విధించారు. సాయంత్రం 4 గంట‌ల నుంచి రాత్రి 9 గంట‌ల వ‌ర‌కు ట్రాఫిక్ ఆంక్ష‌లు అమ‌ల్లో ఉండ‌నున్నాయి.

  • Publish Date - April 6, 2024 / 06:44 AM IST

లోక్‌స‌భ ఎన్నిక‌ల నేప‌థ్యంలో కాంగ్రెస్ పార్టీ జ‌న జాత‌ర పేరిట తుక్కుగూడ‌లో శ‌నివారం సాయంత్రం భారీ బ‌హిరంగ స‌భ నిర్వ‌హించనుంది. ఈ స‌భ‌కు ఏఐసీసీ చీఫ్ మ‌ల్లికార్జున్ ఖ‌ర్గే, సోనియా గాంధీ, రాహుల్ గాంధీతో పాటు ప‌లువురు సీనియ‌ర్ నాయ‌కులు హాజ‌రు కానున్నారు. కాంగ్రెస్ పార్టీ భారీ బ‌హిరంగ స‌భ నేప‌థ్యంలో న‌గ‌ర శివార్ల‌లో పోలీసులు ట్రాఫిక్ ఆంక్ష‌లు విధించారు. సాయంత్రం 4 గంట‌ల నుంచి రాత్రి 9 గంట‌ల వ‌ర‌కు ట్రాఫిక్ ఆంక్ష‌లు అమ‌ల్లో ఉండ‌నున్నాయి.
ట్రాఫిక్ ఆంక్ష‌లు ఇలా..

  • హైద‌రాబాద్ నుంచి శ్రీశైలం వైపు వెళ్లే వాహ‌నాలు రావిర్యాల గ్రామం నుంచి ఎడ‌మ‌వైపు తిరిగి ఆగాఖాన్ అకాడ‌మీ, విజ‌యా డెయిరీ, గాంధీ బొమ్మ‌, రావిర్యాల‌, వండ‌ర్‌లా జంక్ష‌న్, తిమ్మాపూర్, రాచులూరు నుంచి రాచులూరు గేటు మీదుగా వెళ్లాలి.
  • శ్రీశైలం నుంచి హైద‌రాబాద్ వైపు వెళ్లే వాహ‌నాలు.. మ‌హేశ్వ‌రం గేటు వ‌ద్ద ఎడ‌మ‌వైపు తిరిగి మ‌న్‌సాన్‌ప‌ల్లె, నాగారం, పెద్ద గోల్కొండ మీదుగా శంషాబాద్‌కు చేరుకోవాలి. శంషాబాద్ నుంచి హైద‌రాబాద్‌కు చేరుకోవాల్సి ఉంటుంది.
  • తుక్కుగూడ ఓఆర్ఆర్ ఎగ్జిట్ వ‌ద్ద సాధార‌ణ వాహ‌నాల‌ను కింద‌కు దిగ‌డానికి అనుమ‌తించ‌రు. పెద్ద అంబ‌ర్‌పేట నుంచి పెద్ద గోల్కొండ దారిలో సాయంత్రం 4 నుంచి రాత్రి 9 గంట‌ల వ‌ర‌కు సాధార‌ణ వాహ‌నాల‌కు అనుమ‌తి లేదు.

Latest News