Site icon vidhaatha

Rythu Bandhu | అనర్హులకు రైతు బంధు నిధుల రికవరీపై సర్కార్ ఫోకస్‌.. అధికార నిర్ణయానికి చాన్స్‌

విధాత, హైదరాబాద్ : రోడ్లు, లేఅవుట్ చేసిన భూములకు రైతుబంధు తీసుకున్న వారి నుంచి నిధుల రికవరీపై ప్రభుత్వం దృష్టి పెట్టినట్లుగా తెలుస్తుంది. ఇందుకు సంబంధించి ఇప్పటికే జిల్లాల కలెక్టర్లకు ఉత్తర్వులు జారీ కాబడ్డాయని.. రేపో మాపో లబ్ధిదారులకు నోటీసులు అందనున్నాయన్న వార్తలు వైరల్ మారాయి. కాగా దీనిపై ప్రభుత్వం నుంచి ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన అయితే వెలువడలేదు. మేడ్చల్ జిల్లా ఘట్‌కేసర్ మండలం పోచారం గ్రామంలో మోత్కుపల్లి యాదగిరిరెడ్డికి గతంలో పంపిణీ కాబడిన రైతుబంధు డబ్బులు రికవరి చేయాలని ఇప్పటికే కలెక్టర్ స్థానిక తహశీల్ధార్‌కు నోటీస్‌లు జారీ చేసినట్లుగా సమాచారం.

1981నుంచి లే అవుట్‌గా మారిన 33ఎకరాలకు సంబంధించి యాదగిరిరెడ్డి 20లక్షల వరకు రైతుబంధు తీసుకున్నారని, ఇందుల్లో నాన్ అగ్రికల్చర్‌గా మారిన భూమికి సంబంధించి 16.80లక్షలను రెవెన్యూ రికవరీ యాక్ట్ ద్వారా రికవరీ చేయాలని అధికారులు నిర్ణయించినట్లుగా తెలుస్తుంది. ఈ వ్యవహారం నేపథ్యంలో దుర్వినియోగమైన రైతుబంధు సొమ్మును సంబంధిత వ్యక్తుల నుంచి రికవరికి ప్రభుత్వం అధికారికంగా ఆదేశాలిచ్చే అవకాశముందన్న ఫ్రచారానికి దారితీసింది.

Exit mobile version