క్రికెట్ ల‌వ‌ర్స్‌కు టీఎస్ ఆర్టీసీ గుడ్‌న్యూస్‌.. ఉప్ప‌ల్ స్టేడియంకు 60 ప్ర‌త్యేక బ‌స్సులు

హైద‌రాబాద్ న‌గ‌రంలోని ఉప్ప‌ల్ స్టేడియంలో ఇవాళ సాయంత్రం స‌న్ రైజ‌ర్స్ హైద‌రాబాద్ - గుజ‌రాత్ టైటాన్స్ మ‌ధ్య మ్యాచ్ జ‌ర‌గ‌నుంది. ఈ నేప‌థ్యంలో క్రికెట్ ల‌వ‌ర్స్‌కు టీఎస్ ఆర్టీసీ గుడ్‌న్యూస్ వినిపించింది. న‌గ‌రంలోని వివిధ ప్రాంతాల నుంచి ఉప్ప‌ల్ స్టేడియంకు చేరుకునే అభిమానుల‌ను దృష్టిలో ఉంచుకుని, ప్ర‌త్యేక బ‌స్సుల‌ను న‌డ‌పాల‌ని ఆర్టీసీ యాజ‌మాన్యం నిర్ణ‌యించింది.

  • Publish Date - May 16, 2024 / 07:15 AM IST

హైద‌రాబాద్ : హైద‌రాబాద్ న‌గ‌రంలోని ఉప్ప‌ల్ స్టేడియంలో ఇవాళ సాయంత్రం స‌న్ రైజ‌ర్స్ హైద‌రాబాద్ – గుజ‌రాత్ టైటాన్స్ మ‌ధ్య మ్యాచ్ జ‌ర‌గ‌నుంది. ఈ నేప‌థ్యంలో క్రికెట్ ల‌వ‌ర్స్‌కు టీఎస్ ఆర్టీసీ గుడ్‌న్యూస్ వినిపించింది. న‌గ‌రంలోని వివిధ ప్రాంతాల నుంచి ఉప్ప‌ల్ స్టేడియంకు చేరుకునే అభిమానుల‌ను దృష్టిలో ఉంచుకుని, ప్ర‌త్యేక బ‌స్సుల‌ను న‌డ‌పాల‌ని ఆర్టీసీ యాజ‌మాన్యం నిర్ణ‌యించింది. 60 ప్ర‌త్యేక బ‌స్సులు 24 రూట్ల‌లో సాయంత్రం 6 గంట‌ల నుంచి రాత్రి 11.30 గంట‌ల వ‌ర‌కు అందుబాటులో ఉండ‌నున్నాయి. బ‌స్సుల వివ‌రాల కోసం 9959226420, 9959226135, 99592226144 నంబ‌ర్ల‌ను సంప్ర‌దించొచ్చు.

ఇక ఇవాళ ఉప్ప‌ల్‌లో జరగబోయే సన్ రైజర్స్ హైదరాబాద్, గుజరాత్ టైటాన్స్ మ్యాచ్.. హైదరాబాద్ జట్టుకు కీలకంగా మారనుంది. హైదరాబాద్ జట్టు ప్లే అఫ్స్‌కు చేరుకోవడానికి కేవలం ఒక పాయింట్ మాత్రమే అవసరం ఉంది. ఈ నేపథ్యంలోనే క్రికెట్ అభిమానుల్లో తీవ్ర ఆసక్తి నెలకొంది. ఇక లక్నోతో ఆడిన చివరి మ్యాచ్‌లో హైదరాబాద్ జట్టు భారీ విజయాన్ని నమోదు చేసుకున్న సంగ‌తి తెలిసిందే.

ఈ రూట్లలో ప్రత్యేక బస్సులు

మెహదీపట్నం నుంచి ఉప్పల్ స్టేడియం – 4 బస్సులు
ఘాట్ కేసర్ నుంచి ఉప్పల్ స్టేడియం – 4 బస్సులు
హయత్ నగర్ నుంచి ఉప్పల్ స్టేడియం – 2 బస్సులు
ఎన్జీవో కాలనీ నుంచి ఉప్పల్ స్టేడియం – 4 బస్సులు
ఇబ్రహీంపట్నం నుంచి ఉప్పల్ స్టేడియం – 2 బస్సులు
లాబ్ క్వార్టర్స్ నుంచి ఉప్పల్ స్టేడియం- 2 బస్సులు
కోఠి నుంచి ఉప్పల్ స్టేడియం- 2 బస్సులు
అఫ్జల్ గంజ్ నుంచి ఉప్పల్ స్టేడియం- 2 బస్సులు
లక్డీకాపుల్ నుంచి ఉప్పల్ స్టేడియం – 2 బస్సులు
దిల్ సుఖ్ నగర్నుంచి ఉప్పల్ స్టేడియం- 2 బస్సులు
జీడిమెట్ల నుంచి ఉప్పల్ స్టేడియం- 4 బస్సులు
కేపీహెచ్‌బీ నుంచి ఉప్పల్ స్టేడియం- 2 బస్సులు
మేడ్చల్ నుంచి ఉప్పల్ స్టేడియం- 2 బస్సులు
మియాపూర్ నుంచి ఉప్పల్ స్టేడియం- 2 బస్సులు
జేబీఎస్ నుంచి ఉప్పల్ స్టేడియం- 4 బస్సులు
హకీంపేట్ నుంచి ఉప్పల్ స్టేడియం- 2 బస్సులు
ఈసీఐఎల్ ఎక్స్ రోడ్స్ నుంచి ఉప్పల్ స్టేడియం- 2 బస్సులు
బోయినపల్లి నుంచి ఉప్పల్ స్టేడియం- 2 బస్సులు
చార్మినార్ నుంచి ఉప్పల్ స్టేడియం- 4 బస్సులు
చాంద్రాయణగుట్ట నుంచి ఉప్పల్ స్టేడియం- 2 బస్సులు
బీహెచ్ఈఎల్ నుంచి ఉప్పల్ స్టేడియం- 2 బస్సులు
కొండాపూర్ నుంచి ఉప్పల్ స్టేడియం- 2 బస్సులు
ఎల్బీ నగర్ నుంచి ఉప్పల్ స్టేడియం- 2 బస్సులు

Latest News