Site icon vidhaatha

Bandi Sanjay | శ్రీవారి ఆస్తులకు పంగనామాలు పెట్టిన నయవంచకులు పోయారు: బండి సంజయ్

వైసీపీ పాలకులు వీరప్పన్‌ వారసులు
కేంద్ర మంత్రి బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు

విధాత, హైదరాబాద్ : శ్రీవారి ఆస్తులకు పంగనామాలు పెట్టిన నయవంచకులు గద్దె దిగి పోయారని కేంద్ర మంత్రి బండి సంజయ్ అన్నారు. ఇప్పుడు స్వామివారికి నిత్యం సేవ చేసే రాజ్యం వచ్చిందని చెప్పారు. గురువారం తిరుమల శ్రీవారిని దర్శించుకున్న అనంతరం ఆయన మాట్లాడారు. గత వైసీపీ ఆరాచక ప్రభుత్వంలో స్వామివారి నిధులను పక్కదారి పట్టించి తిరుమలను రాజకీయ పునరావాస కేంద్రంగా మార్చారని విమర్శించారు. కొండ మీద అరాచక పాలన ముగిసిందన్నారు. ఇన్నాళ్లు భక్తులు ఎదుర్కొన్న సమస్యలు తొలగి పరిస్థితులు చక్కబడ్డాయని, స్వామివారి ఆస్తుల పరిరక్షణకు పటిష్ట చర్యలు తీసుకుంటామన్నారు.

వైసీపీ ప్రభుత్వ పాలకులు వీరప్పన్ వారసులని కీలక విమర్శలు చేశారు. ఎర్రచందనం పేరుతో జాతీయ సంపదను దోచుకున్నారని, ఆ డబ్బుతో రాజకీయాలను శాసించే స్థాయికి చేరుకున్నారని, ఎర్రచందనం దొంగలను వదిలిపెట్టేదే లేదని చెప్పారు. శేషాచలం కొండల్లో ఎర్రచందనం దోపిడీపై నివేదిక కోరతామని, దాని ఆధారంగా జాతీయ సంపదను దోచుకున్న వారిపై చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ఎర్రచందనం అక్రమ రవాణాపై గతంలోనే సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్, తిరుపతి బీజేపీ నాయకులు అనేక పోరాటాలు చేశారని గుర్తు చేశారు. నరేంద్ర మోదీ దేశాన్ని విశ్వగురువుగా చేసేందుకు కృషి చేస్తున్నారని, ఆయన సారథ్యంలో భారత్ అభివృద్ధి చెందిన దేశంగా మారుతోందని బండి సంజయ్ పేర్కోన్నారు.

Exit mobile version