Site icon vidhaatha

సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన వెలిచాల

అభ్యర్థిత్వానికి సహకరించినందుకు కృతజ్ఞతలు

విధాత బ్యూరో, కరీంనగర్: కరీంనగర్ పార్లమెంట్ స్థానం నుండి కాంగ్రెస్ పార్టీ తమ అభ్యర్థిగా వెలిచాల రాజేందర్ రావు అభ్యర్థిన్ని ఖరారు చేయడంతో, రాజేందర్ రావు గురువారం ముఖ్యమంత్రిని కలుసుకున్నారు. తన ఎంపికకు సహకరించిన సీఎం రేవంత్ రెడ్డికి పుష్పగుచ్చం అందజేసి కృతజ్ఞతలు తెలిపారు.

ఈ సందర్భంగా రాజేందర్ రావుకు కాంగ్రెస్ పార్టీ బీ-ఫారం అందజేశారు.
రాజేందర్ రావు వెంట రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, ప్రభుత్వ విప్ వేములవాడ, మానకొండూరు, చొప్పదండి శాసనసభ్యులు ఆది శ్రీనివాస్, కవ్వంపల్లి సత్యనారాయణ,మేడిపల్లి సత్యం, పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి తీన్మార్ మల్లన్న, హుజురాబాద్ నియోజకవర్గ ఇంచార్జ్ వొడితల ప్రణవ్ బాబు తదితరులు ఉన్నారు.

Exit mobile version