Site icon vidhaatha

లాకోన్స్‌ను సందర్శించిన ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు

హైదరాబాద్‌,విధాత‌: సీసీఎంబీలో ఏర్పాటు చేసిన అంతరించిపోతున్న జీవజాతుల సంరక్షణ ల్యాబోరేటరీని ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు సందర్శించారు. లాకోన్స్ పేరుతో సీసీఎంబీలో ఏర్పాటు చేసిన ఈ పరిశోధన కేంద్రంలో నేషనల్ వైల్డ్ లైఫ్ జెనెటిక్ రిసోర్స్ బ్యాంక్, సహాయక పునరుత్పత్తి ల్యాబ్‌లు ఉన్నాయి. లాకోన్స్‌ను పరిశీలించిన అనంతరం వన్య ప్రాణులపై పరిశోధనలు చేస్తున్న శాస్త్రవేత్తలతో వెంకయ్య ముచ్చటించారు. ఆ తర్వాత లాకోన్స్ సిబ్బంది, సెంట్రల్ జూ అధికారులు సంయుక్తంగా రాసిన ‘ఇంట్రడక్షన్ టూ జెనెటిక్ రిసోర్స్ బ్యాంక్ ఫర్ వైల్డ్ లైఫ్ కన్జర్వేషన్’ పుస్తకాన్ని ఆయన విడుదల చేశారు.
ఈ సందర్భంగా ఉపరాష్ట్రపతి మాట్లాడుతూ లాకోన్స్ వంటి పరిశోధన సంస్థలు, జూలు కలిసి పనిచేయాలని పిలుపునిచ్చారు. అలా చేయడం వల్ల అంతరించిపోతున్న జీవ జాతులను కాపాడుకోవచ్చని అభిప్రాయపడ్డారు. జంతువుల జన్యు పదార్థాలను దాచి ఉంచడంతోపాటు, అంతరించిపోతున్న జీవులను సహాయ పునరుత్పత్తి పద్ధతుల్లో కాపాడేందుకు ఇది ఉపయోగడుతుందన్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ హోంమంత్రి మహమూద్ అలీ, సీసీఎంబీ డైరెక్టర్ వినయ్ నందికూరి, లాకోన్స్ ఇన్‌ఛార్జ్‌ డాక్టర్ కార్తికేయన్ వాసుదేవన్ సహా పలువురు అధికారులు పాల్గొన్నారు.

Exit mobile version