Warangal | పీజీ రీ కౌంటింగ్‌లో అవకతవకలు!..హెల్త్ యూనివర్సిటీలో విజిలెన్స్ విచారణ

వరంగల్ కాళోజీ నారాయణరావు హెల్త్ యూనివర్సిటీలో సోమవారం విజిలెన్స్ అడిషనల్ ఎస్పీ శ్రీనివాసరావు ఆధ్వర్యంలో తనిఖీలు నిర్వహించారు. మెడికల్ పీజీ పరీక్ష ఫలితాల్లో అవకతవకలు జరిగినట్లు వచ్చిన ఆరోపణల నేపథ్యంలో ఈ విజిలెన్స్ తనిఖీలు చేపట్టినట్లు తెలుస్తోంది.

విధాత, వరంగల్ :

వరంగల్ కాళోజీ నారాయణరావు హెల్త్ యూనివర్సిటీలో సోమవారం విజిలెన్స్ అడిషనల్ ఎస్పీ శ్రీనివాసరావు ఆధ్వర్యంలో తనిఖీలు నిర్వహించారు. మెడికల్ పీజీ పరీక్ష ఫలితాల్లో అవకతవకలు జరిగినట్లు వచ్చిన ఆరోపణల నేపథ్యంలో ఈ విజిలెన్స్ తనిఖీలు చేపట్టినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా నలుగురు పీజీ విద్యార్థులు రీవాల్యుయేషన్ పెట్టుకోగా కాళోజీ నారాయణ హెల్త్ యూనివర్సిటీలో అవకతవకలు జరిగినట్లు ఆరోపణలొచ్చాయి. దీనిపై విజిలెన్స్ విచారణ చేపట్టినట్లు భావిస్తున్నారు.

ఈ విచారణ నేపథ్యంలో హెల్త్ యూనివర్సిటి రిజిస్ట్రార్ నాగార్జున రెడ్డి తెలిపిన వివరాలిలా ఉన్నాయి. అక్టోబర్ 7 నుండి నవంబర్ 1 వరకు మెడికల్ పీజీ , ప్రాక్టికల్ పరీక్షలు జరిగాయి. 2123 మంది విద్యార్థులు పీజీ పరీక్ష రాశారు. 1918 మంది విద్యార్థులు పీజీ పరీక్షలో ఉత్తీర్ణులయ్యారు. 205 మంది విద్యార్థులు పీజీ పరీక్షలో ఫెయిల్ అయ్యారు. 155 మంది విద్యార్థులు రీకౌంటింగ్ పెట్టుకున్నారు. నవంబర్ 4న పీజీ పరీక్షల ఫలితాలు విడుదల చేశారు.

Latest News