బౌద్ద సందర్శన క్షేత్రాల్లో బుద్దవనాన్ని అగ్రగామిగా నిలుతాం … మంత్రి జూపల్లి కృష్ణారావు

బౌద్ధ టూరిజం సర్క్యూట్‌లో బుద్దవనాన్ని అగ్రస్థానంలో నిలిపేందుకు కృషి చేస్తామని తెలంగాణ పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు. శనివారం స్థానిక నాగార్జున సాగర్‌ శాసనసభ్యులు కుందూరు జైవీర్‌ రెడ్డి ,మిర్యాలగూడ శాసనసభ్యులు బత్తుల లక్ష్మారెడ్డి తో కలిసి జూపల్లి బుద్ధవనాన్ని సందర్శించారు .

  • Publish Date - June 8, 2024 / 05:59 PM IST

విధాత, హైదరాబాద్ : బౌద్ధ టూరిజం సర్క్యూట్‌లో బుద్దవనాన్ని అగ్రస్థానంలో నిలిపేందుకు కృషి చేస్తామని తెలంగాణ పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు. శనివారం స్థానిక నాగార్జున సాగర్‌ శాసనసభ్యులు కుందూరు జైవీర్‌ రెడ్డి ,మిర్యాలగూడ శాసనసభ్యులు బత్తుల లక్ష్మారెడ్డి తో కలిసి జూపల్లి బుద్ధవనాన్ని సందర్శించారు . ఈ సందర్భంగా జూపల్లి మాట్లాడుతూ టూరిజం ప్రమోషన్ లో భాగంగా నాగార్జున సాగర్ లోని బుద్ధవనంను సందర్శించామన్నారు.

బుద్ధుడి సమగ్ర జీవిత చరిత్రను ఒకే ప్రదేశంలో ఆవిష్కరించేలా నాగార్జునసాగర్‌లో ప్రసిద్ధ బౌద్ధ క్షేత్రంగా బుద్ధవనాన్ని గొప్పగా నిర్మించారన్నారు. ఆచార్య నాగార్జునుడు నడయాడిన ఈ ప్రాంతాన్ని అంతర్జాతీయ బౌద్ధక్షేత్రంగా మరింత అభివృద్ధి చేస్తాం అని తెలిపారు. తెలంగాణ రాష్ట్రం నాగార్జునసాగర్ లోని బుద్ధవనం ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా సందర్శించాల్సిన బౌద్ధ సంప్రదాయ వారసత్వ ఆధ్యాత్మిక కేంద్రమని స్పష్టం చేశారు. సీఎం రేవంత్ రెడ్డి సారథ్యంలో బుద్ధవనంను పర్యాటక, ఆధ్యాత్మిక గమ్యానికి కేంద్రంగా తీర్చిదిద్దుతామన్నారు.

ప్రపంచానికి బౌద్ధ వారసత్వం, సంస్కృతిని చాటి చెప్పాల్సిన అవసరం యువతపై ఉందని పిలుపునిచ్చారు. నాగార్జున సాగర్ ను పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయడం వల్ల ఆదాయంతో పాటు ఉపాధి అవకాశాలు పెరుగుతాయని అందుకు నూతన ప్రతిపాదనలు చేపట్టబోతున్నామని తెలిపారు. దానిలో భాగంగా ట్రెక్కింగ్, చిల్డ్రన్స్ ప్లే గేమ్స్ లతో ఆహ్లాదకరమైన పర్యాటక వాతావరణాన్ని ఏర్పాటు చేస్తామని తెలిపారు.

 

 

Latest News