Miss World:
విధాత: హైదరాబాద్ వేదికగా నిర్వహించ తలపెట్టిన 72వ మిస్ వరల్డ్ (Miss World)పోటీలకు సంబంధించిన ఏర్పాట్లపై ఎల్లుండి గురువారం తెలంగాణ ప్రభుత్వం సన్నాహక సమావేశానికి సిద్ధమైంది. మే 7 నుంచి ప్రారంభమయ్యే అందాల పోటీ నిర్వహణ ఏర్పాట్లపై చర్చించేందుకు ఎల్లుండి బేగంపేట్ లోని టూరిజం ఫ్లాజా హోటల్ లో ప్రీ ఈవెంట్ ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహిస్తున్నారు.
ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ లో మంత్రి జూపల్లి కృష్ణారావు, తెలంగాణ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పటేల్ రమేశ్ రెడ్డి, టూరిజం సెక్రటరీ స్మితా సబర్వాల్, మిస్ వరల్డ్ లిమిటెడ్ సీఈఓ జూలియా మోర్లీ, 2024 ప్రపంచ సుందరి క్రిస్టినా పిజ్కోవాలు హాజరుకానున్నట్లుగా ప్రభుత్వం తెలిపింది. అంతర్జాతీయ స్థాయి ఈవెంట్ కావడంతో రాష్ట్ర ప్రభుత్వం మిస్ వరల్డ్ పోటీలను ప్రతిష్టాత్మకంగా తీసుకుంటుంది. ఈ పోటీల నిర్వాహణ ద్వారా తెలంగాణ టూరిజం..పారిశ్రామిక రంగాల వైపు ప్రపంచ దేశాలను ఆకర్షించాలని ప్రభుత్వం యోచిస్తుంది.