విధాత, హైదరాబాద్ : విద్యతోనే స్వేచ్ఛ, సమానత్వం సాధ్యమవుతుందని ఎక్సైజ్, పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. రవీంద్రభారతీలో శ్రీ నారయణ గురు ధర్మ ప్రచారణ సభ ఆద్వర్యలో నిర్వహించిన సెంటినరీ వేడుకలు – సర్వమత సమ్మేళనం కార్యక్రమానికి మంత్రి జూపల్లి ముఖ్యతిధిగా హాజరయ్యారు. కేరళకు చెందిన ప్రముఖ ఆధ్యాత్మిక గురువు, సంఘ సంస్కర్త శ్రీ నారాయణ గురు విగ్రహానికి పుష్పాంజలి ఘటించి, నివాళులర్పించారు. ఈ సందర్భంగా మంత్రి జూపల్లి మాట్లాడుతూ.. సమాజంలోని మూడ విశ్వాసలను, కుల తత్వాన్ని నిరసించి, కులం కారణంగా కొన్ని వర్గాల ప్రజలు అన్యాయానికి గురవుతున్నారని, వారికి ఆధ్యాత్మిక స్వేచ్ఛ , సామాజిక స్వాతంత్రం ఉండాలని భావించిన గొప్ప వ్యక్తి నారాయణ గురు అన్నారు. ఆధ్యాత్మిక జ్ఞానోదయం, సామాజిక మానవత్వాన్ని ప్రోత్సహించేందుకు ప్రయత్నం చేశాడని, కాలానికి అనుగుణంగా మతాన్ని నారాయణ గురు సంస్కరించారని ఆయన చేసిన సేవలను కొనియాడారు. నారాయణ గురు ఆలోచనలకు అనుగుణంగా నడుచుకోవాల్సిన అవసరం ఉందని చెప్పారు. దశాబ్ధాలు, శతాబ్ధాలు గడిచినా సమాజంలో ఇంకా అంతరాలు తొలగిపోలేదని.. దీనికి మనషుల ఆలోచన ధోరణి, ప్రభుత్వాలే ప్రధాన కారణమని… వ్యవస్థలోని లోపాలను ఎత్తి చూపారు. మనిషి తనను తాను సంస్కరించుకుని సమాజాన్ని సంస్కరించడమే చదువు యొక్క అర్థం.. పరమార్ధం అని, నేటి విద్య వ్యవస్థలో ఇది లోపించిందని, చదవేస్తే ఉన్న మతి పోయినట్లు తయారైందని అన్నారు. నేటి సమాజంలో నేరాలు, ఘోరాలు పెరిగిపోతున్నాయని, యువత ఆలోచన ధోరణిలో మార్పు రావాల్సిన అవసరం ఉందని, వారిని సన్మార్గంలో నడపాల్సిన బాధ్యత మనందరిపై ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో జాతీయ బీసీ కమిషన్ మాజీ చైర్మన్ జస్టిస్ ఈశ్వరయ్య, డా.జయప్రకాష్ నారాయణ, మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్, శ్రీ నారయణ గురు ధర్మ ప్రచారణ సభ ప్రెసిడెంట్ సాయిబాబా గౌడ్, జనరల్ సెక్రటరీ ఉపేందర్, వైస్ ప్రెసిడెంట్లు మురళీ మనోహర్, చెన్నయ్య, కోశాధికారి జంగయ్య, తదితరులు పాల్గొన్నారు.
Jupalli Krishna Rao | విద్యతోనే స్వేచ్ఛ, సమానత్వం సాధ్యమవుతుంది : జూపల్లి కృష్ణరావు
విద్యతోనే స్వేచ్ఛ, సమానత్వం సాధ్యమవుతుందని ఎక్సైజ్, పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. రవీంద్రభారతీలో శ్రీ నారయణ గురు ధర్మ ప్రచారణ సభ ఆద్వర్యలో నిర్వహించిన సెంటినరీ వేడుకలు - సర్వమత సమ్మేళనం కార్యక్రమానికి మంత్రి జూపల్లి ముఖ్యతిధిగా హాజరయ్యారు.

Latest News
గురువారం రాశిఫలాలు.. ఈ రాశివారికి మొండి బాకీలు వసూలు..!
చెలరేగిన అభిషేక్ : కివీస్‌తో తొలి టి20లో భారత్ ఘనవిజయం
మేడారంలో మండ మెలిగే పండుగ సందడి... భారీగా భక్తులరాకతో తీవ్రరద్దీ
కేబీఆర్ పార్క్ చుట్టూ ఇక నో జామ్స్.. జుమ్‌జుమ్మని దూసుకెళ్లడమే..
ఒక్క క్షణంలో రక్తస్రావానికి బ్రేక్! కొరియా శాస్త్రవేత్తల వినూత్న ఆవిష్కరణ!
దావోస్ సదస్సులో ప్రేయసిని చూసి కన్నుగీటిన ట్రూడో.. కెమెరాకు చిక్కిన రొమాంటిక్ మూమెంట్స్..
ట్రంప్‌పై పోరాటానికి తుపాకులు పట్టిన ధృవపు ఎలుగుబంట్లు, డాల్ఫిన్లు స్లెడ్జ్ కుక్కలు!! ఇంటర్నెట్ను ఊపేస్తున్న వీడియో
పిజా హట్ ఓపెన్ చేసి నవ్వులపాలైన పాక్ మంత్రి.. ఇంతకీ ఏం జరిగిందంటే..?
జిల్లాల పునర్వ్యస్థీకరణకు జనగణన బ్రేక్!
ట్రంప్‌తో వివాదం వేళ.. దావోస్ సదస్సు వేదికపై సన్‌గ్లాసెస్‌తో ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రాన్.. నెట్టింట చర్చ