Wine Shops | ఆ మూడు ఉమ్మ‌డి జిల్లాల్లో ఎల్లుండి వ‌ర‌కు వైన్స్ బంద్

Wine Shops | ఖ‌మ్మం - వ‌రంగ‌ల్ - న‌ల్ల‌గొండ ప‌ట్ట‌భ‌ద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక నేప‌థ్యంలో ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. ఈ నెల 27న ఉప ఎన్నిక పోలింగ్ నేప‌థ్యంలో ఈ మూడు ఉమ్మ‌డి జిల్లాల ప‌రిధిలో వైన్ షాపులు మూసివేయాల‌ని అధికారులు ఆదేశించారు.

  • Publish Date - May 25, 2024 / 07:34 PM IST

Wine Shops | హైద‌రాబాద్ : ఖ‌మ్మం – వ‌రంగ‌ల్ – న‌ల్ల‌గొండ ప‌ట్ట‌భ‌ద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక నేప‌థ్యంలో ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. ఈ నెల 27న ఉప ఎన్నిక పోలింగ్ నేప‌థ్యంలో ఈ మూడు ఉమ్మ‌డి జిల్లాల ప‌రిధిలో వైన్ షాపులు మూసివేయాల‌ని అధికారులు ఆదేశించారు. శ‌నివారం సాయంత్రం నుంచి సోమ‌వారం సాయంత్రం 6 గంట‌ల వ‌ర‌కు వైన్ షాపులు మూసి ఉంటాయి. నిబంధ‌న‌లు ఉల్లంఘించిన వారిపై క‌ఠిన చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని అధికారులు హెచ్చ‌రించారు.

ఉమ్మ‌డి జిల్లాలు న‌ల్ల‌గొండ‌, ఖ‌మ్మం, వ‌రంగ‌ల్ ప‌రిధిలోని 34 నియోజ‌క‌వ‌ర్గాల్లో పోలింగ్ ప్ర‌క్రియ కొన‌సాగ‌నుంది. ఉద‌యం 8 గంట‌ల నుంచి సాయంత్రం 4 వ‌ర‌కు పోలింగ్ నిర్వ‌హించ‌నున్నారు. ఈ 34 నియోజ‌క‌వ‌ర్గాల్లో గ్రాడ్యుయేట్ ఓట‌ర్లు 4 ల‌క్ష‌ల‌కు పైగా ఉన్నారు. అయితే బీఆర్ఎస్ నుంచి రాకేశ్ రెడ్డి, కాంగ్రెస్ నుంచి తీన్మార్ మ‌ల్ల‌న్న‌, బీజేపీ నుంచి గుజ్జుల ప్రేమేంద‌ర్ రెడ్డి బ‌రిలో ఉన్నారు.

Latest News