Site icon vidhaatha

Aadhar – Pan | ఆధార్‌-పాన్‌ అనుసంధానం చేయలేదా..? ఇకపై ఈ పనులేవీ చేయలేరు జాగ్రత్త..!

Aadhar – Pan |

ప్రస్తుత రోజుల్లో ఆధార్‌ కార్డ్‌, పాన్‌ కార్డులు కీలకంగా మారాయి. గుర్తింపు కార్డులాగానే కాకుండా ఆర్థిక లావాదేవీల్లోనూ వీటి వినియోగం పెరిగింది. ఈ క్రమంలో ఆదాయం చట్టంలోని 139 ఏఏ సెక్షన్‌ ప్రకారం పాన్‌ను ఆధార్‌ నంబర్‌తో అనుసంధానం చేయాల్సి ఉంటుంది.

అయితే, ఇందుకు జూన్‌ నెల 30 వరకు గడువు ఇచ్చింది. గడువులోగా అనుసంధానం చేయని పాన్‌లను ఇన్‌ యాక్టివ్‌ చేసింది. దాదాపు ఈ పాన్‌కార్డులన్న రద్దయ్యాయన్న మాటే. పాన్‌కార్డు రద్దయితే భవిష్యత్‌లో ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. పాన్‌ యాక్టివ్‌లో లేకపోతే చాలా రకాల పనులను మాత్రం పూర్తి చేసుకునేందుకు అవకాశం ఉండదు.

ఇన్‌కం టాక్స్‌ చట్టంలోని 114బీ నిబంధన ప్రకారం.. దాదాపు దాదాపు 15 రకాల లావాదేవీల కోసం పాన్‌ తప్పనిసరిగా అందించాల్సి ఉంటుంది. అయితే, ఇందులో కేవలం 80 ఏళ్లకుపైబడిన సీనియర్‌ సిటిజన్స్‌కు మినహాయింపు ఉంటుంది. అలాగే అసోం, జమ్మూ కశ్మీర్‌, మేఘాలయ రాష్ట్రాలకు సైతం కేంద్రం మినహాయింపు ఇచ్చింది. మిగతా రాష్ట్రాలకు చెందిన వారంతా తప్పనిసరిగా పాన్‌ – ఆధార్‌ను లింక్‌ చేయాల్సి ఉంటుంది.

అయితే, పాన్‌ ఆధార్‌తో అనుసంధానానికి పలుమార్లు కేంద్రం గడువును పెంచుతూ వచ్చింది. చివరిగా జూన్‌ 30 వరకు అవకాశం ఇచ్చింది. అయితే, ఎవరైనా పాన్‌ను ఆధార్‌ను అనుసంధానం చేయకపోతే ఇప్పటికీ చివరి అవకాశం ఉన్నది. ఫైన్‌ చెల్లించి ఆధార్‌తో అనుసంధానం చేసుకునే వీలున్నది. జరిమానాను చెల్లించి పాన్‌ను యాక్టివ్‌గా మార్చుకునే వీలున్నది. అనుసంధానం కోసం దరఖాస్తు చేసినప్పటి నుంచి నెల రోజుల గడువు ఉంటుంది. అప్పటి వరకూ పాన్‌ చెల్లుబాటు కాదు.

పాన్‌ ఆధార్‌తో అనుసంధానం చేయకుంటే ఈ పనులు చేయలేం..

Exit mobile version