Site icon vidhaatha

Brahmaji | అదేం కోరికయ్యా బ్రహ్మాజీ.. మరీ ‘బేబీ’తోనా..

Brahmaji |

క్యారెక్టర్ ఏదైనా అందులో ఇట్టే ఇమిడిపోయి పాత్రకు న్యాయం చేయగలిగే సత్తా ఉన్న ఆర్టిస్ట్ బ్రహ్మాజీ. కామెడీ, విలనిజం, సపోర్టింగ్ క్యారెక్టర్ ఏదైనా సరే తనవంతు నటనతో మార్కులు కొట్టేస్తాడు. ఇక ఈమధ్య బ్రహ్మాజీ మీద ట్వీట్ల వర్షం కురుస్తోంది. ఈ మధ్యకాలంలో వచ్చే ప్రతి సినిమాలో ఆయన కనబడుతున్నాయి. వాళ్ల అబ్బాయి కూడా హీరోగా సినిమాలు చేస్తున్నాడు. కానీ వాళ్ల అబ్బాయి కంటే కూడా బ్రహ్మాజీనే యంగ్‌గా కనిపిస్తుంటారు.

ఇదే విషయంపై బ్రహ్మాజీని సోషల్ మీడియాలో మిగతా కమెడియన్స్ ఆటపట్టిస్తుంటారు. నిజంగానే బ్రహ్మాజీ ఫిజిక్‌గా బాగా మెయింటైన్ చేస్తుంటాడు. రీసెంట్‌గా ఓ బ్రహ్మాజీ అభిమాని ట్విట్టర్ వేదికగా ‘బేబీ’లాంటి సినిమాలో మెయిన్ క్యారెక్టర్ నువ్వే చేయాలని కోరగా.. దానికి తనదైన కామెడీ స్టైల్‌లో స్పందించి రకరకాల ఎక్స్ర్పెషన్స్ పెట్టి ‘బేబీ’ డైరెక్టర్ అయిన సాయి రాజేష్‌కి ట్యాగ్ చేశాడు బ్రహ్మాజీ.

Exit mobile version