Site icon vidhaatha

Job Opportunities | తెలుగు రాష్ట్రాల్లో ఉద్యోగాల ధమాకా! ఏపీలో మెగా డీఎస్సీ, తెలంగాణలో ఆర్టీసీ కొలువులు

Job Opportunities |

తెలుగు రాష్ట్రాల్లో ఉద్యోగ ధమాకాకు తెరలేచింది. ఏపీలో సీఎం చంద్రబాబు జన్మదినం సందర్భంగా ప్రభుత్వం మెగా డీఎస్సీకి నోటిఫికేషన్ జారీ చేసింది. 16,347 టీచర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇందుకు సంబంధించిన పరీక్ష షెడ్యూల్, సిలబస్ తదితర వివరాలను వెబ్ సైట్ లో అందుబాటులో ఉంచింది.

తెలంగాణ ఆర్టీసీలో 3038ఉద్యోగాలకు నోటిఫిషన్

తెలంగాణ ఆర్టీసీ లో 3038 ఉద్యోగాలకు నోటిఫికేషన్ జారీ చేయనున్నట్లుగా రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ వెల్లడించారు. ఇప్పటికే ఈ ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం అనుమతించిందని త్వరలోనే నోటిఫికేషన్ జారీ చేస్తామన్నారు. ఇప్పటికే ప్రజా పాలన ప్రభుత్వంలో నిరుద్యోగులకు పెద్ద పీట వేస్తూ దాదాపు 60 వేలకు పైగా ఉద్యోగాలను భర్తీ చేసిందన్నారు. తెలంగాణ ఆర్టీసీలో మహాలక్ష్మీ పథకం కింద ఇప్పటి వరకు 165 కోట్ల మంది మహిళలు ఉచితంగా ప్రయాణం చేశారని వారు 5500 కోట్ల రూపాయలు ఆదా చేసినట్లు పేర్కొన్నారు. మహాలక్ష్మి కోసం కొత్త బస్సులు కొనుగోలు చేశామని ఇప్పుడు ఉద్యోగాల భర్తీకి ఆర్టీసీ సన్నద్ధమయ్యామని పేర్కొన్నారు.

భర్తీ చేయనున్న మొత్తం 3038 ఉద్యోగాలలో డ్రైవర్ -2000, శ్రామిక్ -743, డిప్యూటీ సూపరిండెంట్ (ట్రాఫిక్) – 84, డిప్యూటీ సూపరిండెంట్ (మెకానికల్) – 114, డిపో మేనేజర్/ అసిస్టెంట్ ట్రాఫిక్ మేనేజర్ – 25, అసిస్టెంట్ మెకానికల్ ఇంజనీర్ – 18, అసిస్టెంట్ ఇంజనీర్ (సివిల్) – 23, సెక్షన్ ఆఫీసర్ ( సివిల్) -11, అకౌంట్ ఆఫీసర్స్ – 6, మెడికల్ ఆఫీసర్స్ జనరల్ – 7, మెడికల్ ఆఫీసర్స్ స్పెషలిస్ట్ – 7 పోస్టులు ఉన్నాయని పొన్నం తెలిపారు.

Exit mobile version