విధాత : హైదరాబాద్: గ్రూప్ పోస్టులు పెంచాలని, మెగా డీఎస్సీ ప్రకటించాలన్న తదితర నిరుద్యోగ డిమాండ్ల సాధనకు ఏబీవీపీ విద్యార్థి సంఘం మంగళవారం నాంపల్లిలోని టీజీపీఎస్సీ కార్యాలయం ముట్టడి నిర్వహించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఏబీవీపీ కార్యకర్తలు టీజీపీఎస్సీ కార్యాలయంవైపు దూసుకెళ్లగా పోలీసులు వారిని అడ్డుకున్నారు. దీంతోవారు కార్యాలయం ముందు రోడ్డుపై బైఠాయించి ఆందోళన కొనసాగించగా వారిని పోలీసులు బలలవంతంగా అరెస్టు చేశారు. ఈ క్రమంలో పోలీసులకు, ఏబీవీపీ విద్యార్థులకు మధ్య తోపులాట కొంత ఉద్రిక్తతకు దారితీసింది. పోలీసులు ఏబీవీపీ కార్యకర్తలను, నాయకులను ఒక్కొక్కరుగా అరెస్టు చేసి అక్కడి నుంచి తరలించారు. ఈ సందర్భంగా ఏబీవీపీ కార్యదర్శి ఝాన్సీ మాట్లాడుతూ గ్రూప్ 1, 2, 3 పోస్టులు పెంచాలని డిమాండ్ చేశారు. టీచర్ పోస్టుల సంఖ్యను పెంచి మెగా డీఎస్సీ నిర్వహించాలన్నారు. గ్రూప్-1 మెయిన్స్‌కి 1:100 పిలువాలని డిమాండ్ చేశారు. ఉద్యోగాల సంఖ్య పెంచే వరకు ఉద్యమిస్తామని స్పష్టం చేశారు. ఉద్యోగాలు భర్తీ చేస్తామని రేవంత్ రెడ్డి హామీ ఇచ్చి మోసం చేశారని ఆగ్రహం వ్యక్తంచేశారు. గ్రూప్-2, 3తోపాటు ఉపాధ్యాయ పోస్టులు చాలావరకు ఖాళీగా ఉన్న ప్రభుత్వం జాబ్ క్యాలెండర్ ప్రకటించి ఎందుకు ఉద్యోక భర్తీ చేపట్టడం లేదంటూ విమర్శించారు.
ఏబీవీపీ టీజీపీఎస్సీ ముట్టడి ఉద్రికత్త తోపులాట..అరెస్టు
గ్రూప్ పోస్టులు పెంచాలని, మెగా డీఎస్సీ ప్రకటించాలన్న తదితర నిరుద్యోగ డిమాండ్ల సాధనకు ఏబీవీపీ విద్యార్థి సంఘం మంగళవారం నాంపల్లిలోని టీజీపీఎస్సీ కార్యాలయం ముట్టడి నిర్వహించారు.

Latest News
న్యూజీలాండ్దే రెండో వన్డే : విజేతను నిర్ణయించేది ఇక మూడో మ్యాచ్
వర్కింగ్ జర్నలిస్టులను బలి పశువులను చేయకండి
తిరుమల విమాన వెంకటేశ్వురుడికి ‘కాకబలి’ నివేదన చూడండి
గమ్యం చేరిన ఐఎన్ఎస్వీ కౌండిన్య తెర చాప నౌక
ఐకాన్ స్టార్ నెక్ట్స్ ప్రాజెక్ట్పై క్రేజీ అనౌన్స్మెంట్..
మహిళలను అవమానించే కథనాలు ఆమోదయోగ్యం కాదు: సీపీ సజ్జనార్
రాజ్ కోట్ వన్డేలో న్యూజిలాండ్ టార్గెట్ 285
శిక్షణా తరగతులను జర్నలిస్టులు సద్వినియోగం చేసుకోవాలి: టీయూడబ్ల్యూజే జిల్లా అధ్యక్షుడు గార్లపాటి
చైనా మాంజాకు మరొకరి బలి !
వండర్ .. కిలో మల్లెపూలు రూ.6వేలు !