IRCTC | సాయిబాబా భక్తులకు తీపికబురు..! షిర్డీకి వెళ్లేందుకు సూపర్‌ ప్యాకేజీ ప్రకటించిన ఐఆర్‌సీటీసీ..!

IRCTC | త్వరలోనే పాఠశాలలకు సెలవులు రాబోతున్నాయి. దాంతో కొందరు పర్యాటక ప్రాంతాలకు వెళ్లేందుకు ప్లాన్‌ చేసుకుంటారు. మరికొందరు ప్రముఖ ఆలయాలకు వెళ్లాలని భావిస్తుంటారు. దేశంలో ఎన్నో ప్రముఖ ఆలయాలు ఉన్నాయి. వాటిని సందర్శించేందుకు ఐఆర్‌సీటీసీ పలు ప్యాకేజీలను తీసుకువస్తుంది. తాజాగా షిర్డీ వెళ్లాలని భావించే బాబా భక్తుల కోసం సరికొత్త ప్యాకేజీని తీసుకువచ్చింది. నాలుగు రోజుల పాటు ప్యాకేజీ టూర్‌ ఉంటుంది.

  • Publish Date - April 15, 2024 / 09:38 AM IST

IRCTC | త్వరలోనే పాఠశాలలకు సెలవులు రాబోతున్నాయి. దాంతో కొందరు పర్యాటక ప్రాంతాలకు వెళ్లేందుకు ప్లాన్‌ చేసుకుంటారు. మరికొందరు ప్రముఖ ఆలయాలకు వెళ్లాలని భావిస్తుంటారు. దేశంలో ఎన్నో ప్రముఖ ఆలయాలు ఉన్నాయి. వాటిని సందర్శించేందుకు ఐఆర్‌సీటీసీ పలు ప్యాకేజీలను తీసుకువస్తుంది. తాజాగా షిర్డీ వెళ్లాలని భావించే బాబా భక్తుల కోసం సరికొత్త ప్యాకేజీని తీసుకువచ్చింది. నాలుగు రోజుల పాటు ప్యాకేజీ టూర్‌ ఉంటుంది. షిర్డీతో పాటు శనిశింగనాపూర్‌ ఆలయాన్ని సైతం దర్శించుకునేందుకు వీలున్నది. తక్కువ ఖర్చుతోనే ఆయా ఆలయాలను దర్శించుకొని తిరిగి వచ్చే అవకాశం ఐఆర్‌సీటీసీ కల్పిస్తున్నది. ఈ ప్యాకేజీ ఏపీలోని విజయవాడ నుంచి ప్రారంభం కానున్నది. సాయి సన్నిధి ఎక్స్‌ విజయవాడ పేరుతో ఐఆర్‌సీటీసీ ఈ టూర్‌ ప్యాకేజీని ప్రకటించింది. ప్రస్తుతం ప్యాకేజీ ఈ నెల 23న అందుబాటులో ఉన్నది. ప్రతి మంగళవారం రోజున ప్యాకేజీలో షిర్డీ ప్యాకేజీ నడుస్తుంది. ప్యాకేజీలో రైలు ద్వారా ప్రయాణం ఉంటుంది. విజయవాడతో పాటు ఖమ్మం, వరంగల్‌, సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్లలో సైతం ప్యాకేజీలో బుక్‌ చేసుకునేందుకు వీలుంటుంది.

ప్రయాణం ఇలా..

తొలిరోజు ఏప్రిల్‌ 23న విజయవాడ రైల్వేస్టేషన్‌ నుంచి ప్రారంభమవుతుంది. 17208 నంబరు గల రైలులో ఉదయం 10.15 గంటలకు రైలు ప్రయాణం మొదలవుతుంది. రెండోరోజు ఉదయం 6.15 గంటలకు నాగర్‌సోల్‌ చేరుకుంటారు. ఆ తర్వాత అక్కడి నుంచి షిర్డీకి బయలుదేరి వెళ్తారు. హోటల్‌లోకి వెళ్లి రెడీ అయ్యాక సాయిబాబా దర్శనానికి వెళ్తారు. సాయంత్రం అక్కడే షాపింగ్‌ కూడా చేసుకోవచ్చు. రాత్రి షిర్డీలోనే బస చేయాల్సి ఉంటుంది. మూడోరోజు ఉద‌యం శ‌నిశింగ‌నాపూర్‌కు వెళ్తారు. అక్కడ్నుంచి మళ్లీ షిర్డీకి చేరుకుంటారు. రాత్రి 7.30 గంటలకు నాగర్‌సోల్‌ స్టేషన్‌లో తిరుగు ప్రయాణం మొదలవుతుంది. తిరిగి నాలుగో రోజు తెల్లవారు జామున 3 గంటలకు విజయవాడ రైల్వేస్టేషన్‌కి చేరుకోవడంతో టూర్‌ ముగుస్తుంది.

ప్యాకేజీ ఎవరికి ఎంత?

షిర్డీ టూర్‌ ప్యాకేజీలు వివిధ కేటగిరిలో అందుబాటులో ఉన్నాయి. కంఫర్ట్ క్లాస్‌లో థర్డ్‌ ఏసీలో ప్రయాణం ఉంటుంది. లో సింగిల్ ఆక్యుపెన్సీకి రూ.16,165 చెల్లించాల్సి ఉంటుంది. డబుల్ ఆక్యుపెన్సీకి రూ.10,045 చెల్లించాల్సి ఉంటుంది. ట్రిపుల్ ఆక్యుపెన్సీకి రూ.8,440గా నిర్ణయించారు. ఐదు నుంచి 11 ఏళ్ల చిన్నారులకు ధరలు వేరువేరుగా ఉన్నాయి. స్టాండర్డ్ క్లాస్‌లో స్లీపర్‌ క్లాస్‌లో ప్రయాణం ఉంటుంది. ట్రిపుల్ షేరింగ్‌కు రూ.5,985.. సింగిల్ షేరింగ్‌కు రూ.13705 ధ‌ర‌గా నిర్ణయించారు. డబుల్ షేరింగ్‌కి రూ.7,590 టికెట్ ధ‌ర నిర్ణయించారు. ప్యాకేజీని బుక్ చేసుకోవాల‌నుకునేవారు వెబ్‌సైట్‌లోకి irctctourism.com లాగిన్‌ అవ్వాలని.. లేకపోతే 040-27702407, 9701360701 నంబర్లలో సంపద్రించాలని ఐఆర్‌సీటీసీ కోరింది.

Latest News