IRCTC Tour Package | సుందర్‌ సౌరాష్ట్ర ప్యాకేజీ ప్రకటించిన ఐఆర్‌సీటీసీ.. హైదరాబాద్‌ నుంచే ప్రయాణం..!

IRCTC Tour Package | పర్యాటకుల కోసం ఐఆర్‌సీటీఐ సరికొత్త ప్యాకేజీని ప్రకటించింది. ఈ ప్యాకేజీ హైదరాబాద్‌లో నుంచే మొదలవుతుంది. పర్యటనలో భాగంగా అహ్మదాబాద్‌, వడోదర, ద్వారక, సోమ్‌నాథ్‌ తదితర ఆధ్యాత్మిక ప్రదేశాలను చూసే వీలు కలుగనున్నది. ఏడురాత్రులు, ఎనిమిది రోజుల పాటు పర్యటన కొనసాగుతున్నది. ఎవరైనా క్షేత్రాలను దర్శించుకునేందుకు ప్లాన్‌ చేసుకుంటుంటే ఈ ప్యాకేజీ ఎంతో ఉపయోగకరంగా ఉండనున్నది. ఐఆర్‌సీటీసీ ఈ ప్యాకేజీని ‘సుందర్‌ సౌరాష్ట్ర’ పేరుతో రన్‌ చేస్తుంది.

  • Publish Date - April 25, 2024 / 09:20 AM IST

IRCTC Tour Package | పర్యాటకుల కోసం ఐఆర్‌సీటీఐ సరికొత్త ప్యాకేజీని ప్రకటించింది. ఈ ప్యాకేజీ హైదరాబాద్‌లో నుంచే మొదలవుతుంది. పర్యటనలో భాగంగా అహ్మదాబాద్‌, వడోదర, ద్వారక, సోమ్‌నాథ్‌ తదితర ఆధ్యాత్మిక ప్రదేశాలను చూసే వీలు కలుగనున్నది. ఏడురాత్రులు, ఎనిమిది రోజుల పాటు పర్యటన కొనసాగుతున్నది. ఎవరైనా క్షేత్రాలను దర్శించుకునేందుకు ప్లాన్‌ చేసుకుంటుంటే ఈ ప్యాకేజీ ఎంతో ఉపయోగకరంగా ఉండనున్నది. ఐఆర్‌సీటీసీ ఈ ప్యాకేజీని ‘సుందర్‌ సౌరాష్ట్ర’ పేరుతో రన్‌ చేస్తుంది. ప్రస్తుతం మే 1న ప్యాకేజీ అందుబాటులో ఉంది. ప్రతి బుధవారం ప్రయాణం చేయవచ్చు.

ఎనిమిదిరోజుల పర్యటన ఇలా..

ఈ ప్యాకేజీలో మొత్తం ఎనిమిదిరోజుల పాటు పర్యటన కొనసాగుతుంది. తొలిరోజు సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌లో మధ్యాహ్నం 3గంటలకు పోర్‌బందర్‌ సూపర్‌ఫాస్ట్‌ ఎక్స్‌ప్రెస్‌ (20967) రైలును ఎక్కాల్సి ఉంటుంది. రాత్రంతా ప్రయాణం కొనసాగుతుంది. రెండోరోజు ఉదయం 11 గంటలకు వడోదర రైల్వేస్టేషన్‌కు చేరుకుంటారు. స్టేషన్‌ నుంచి హోటల్‌కు వెళ్తారు. అదేరోజు స్టాచ్యూ ఆఫ్‌ యూనిటీని చూసేందుకు వెళ్తారు. అయితే, అక్కడ టికెట్‌ను పర్యాటకులే భరించాల్సి ఉంటుంది. టికెట్ల కోసం soutickets.in వెబ్‌సైట్‌లో సంప్రదించాలి. ఆ తర్వాత తిరిగి వడోదరకు చేరుకొని రాత్రి అక్కడే బస చేస్తారు. మూడోరోజు ఉదయం లక్ష్మీ విలాస్‌ ప్యాలెస్‌ సందర్శన ఉంటుంది. అనంతరం 110 కిలోమీటర్ల దూరంలో ఉన్న అహ్మదాబాద్‌కు ప్రయాణిస్తారు. అక్కడ సబర్మతి ఆశ్రమం, అక్షరధామ్ ఆలయ సందర్శన ఉంటుంది.

రాత్రి అహ్మదాబాద్‌లోనే బస చేస్తారు. నాలుగోరోజు ద్వారకకు వెళ్తారు. మార్గమధ్యలో జామ్‌నగర్ లఖోటా ప్యాలెస్, మ్యూజియాన్ని సందర్శిస్తారు. సాయంత్రం ద్వారకకు చేరుకొని.. హోటల్‌లో బస చేస్తారు. ఐదోరోజు ఉదయం ద్వారకాదీష్ ఆలయ సందర్శన ఉంటుంది. అనంతరం బెట్ ద్వారక, నాగేశ్వర్ ఆలయం, శివరాజ్‌పూర్ బీచ్ సందర్శనకు వెళ్లాల్సి ఉంటుంది. ఆ తర్వాత తిరిగి ద్వారకకు చేరుకొని రాత్రి అక్కడే బస చేస్తారు. ఆరోరోజు హోటల్‌ చెక్‌ అవుట్‌ చేసి సోమ్‌నాథ్‌కు వెళ్తారు. మార్గమధ్యలో పోర్‌బందర్‌ కీర్తి మందిర్‌, సుధామ దేవాలయం తదితర ప్రదేశాలను వీక్షిస్తారు. సోమనాథ్ చేరుకొని జ్యోతిర్లింగాన్ని దర్శించుకుంటారు. అదేరోజు సాయంత్రం తిరిగి పోర్‌బందర్‌ రైల్వేస్టేషన్‌కు చేరుకుంటారు. ఏడోరోజు వేకువ జామున 12.50 గంటలకు తిరిగి ప్రయాణం మొదలవుతుంది. ఎనిమిదో రోజు ఉదయం 8.20 గంటలకు సికింద్రాబాద్‌ చేరుకోవడంతో ప్రయాణం ముగుస్తుంది.

ప్యాకేజీ వివరాలు ఇవే..

ఐఆర్‌సీటీసీ సుందర్‌ సౌరాష్ట్ర ప్యాకేజీలో రెండురకాల ప్యాకేజీలు అందుబాటు ఉన్నాయి. కంఫర్ట్‌ క్లాస్‌లో థర్డ్‌ ఏసీ ప్రయాణం ఉంటుంది. ట్విన్‌ షేరింగ్‌కు రూ.28,280 చెల్లించాలి. ట్రిపుల్ షేరింగ్‌కు రూ.27,610 చెల్లిస్తే సరిపోతుంది. 5-11 సంవత్సరాల పిల్లలకు బెడ్‌తో కలిపి రూ.22,060.. విత్ అవుట్ బెడ్‌ అయితే రూ.20,020 ధర నిర్ణయించారు. స్టాండర్డ్‌ కేటగిరిలో స్లీపర్‌ క్లాస్‌లో ప్రయాణం ఉంటుంది. ఇందులో ట్విన్‌ షేరింగ్‌కు రూ.25,430.. ట్రిపుల్‌ షేరింగ్‌కు 24,760 చెల్లించాల్సి ఉంటుంది. ప్యాకేజీలోను రైలు టికెట్లు, ఏసీ అకామిడేషన్‌, ఏపీ వాహనాల్లో ప్రయాణం, నాలుగు రోజులు బ్రేక్‌ఫాస్ట్‌, డిన్నర్‌, ట్రావెల్‌ ఇన్సూరెన్స్‌ కవర్‌ అవుతాయి. రైలులో భోజనానికి ప్రయాణికులే భరించాల్సి ఉంటుంది. పూర్తి వివరాల కోసం irctctourism.com వెబ్‌సైట్‌లో సంప్రదించాలని కోరింది.

 

Latest News