Arunachalam Giri Pradakshina | కార్తీక మాసం( Karthika Masam ) నేపథ్యంలో శివాలయాలకు( Shivalayam ) భక్తులు పోటెత్తుతున్నారు. తెలంగాణ( Telangana ), ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో ఉన్న శివాలయాలతో పాటు పొరుగు రాష్ట్రాలైన కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడు( Tamil Nadu )లోని శైవక్షేత్రాలకు కూడా భక్తులు బయల్దేరుతున్నారు. ఆ పరమశివుని దర్శించుకుని మొక్కులు చెల్లించుకునేందుకు భక్తులు పయనమవుతున్నారు.
కార్తీక పౌర్ణమి సందర్భంగా అరుణాచలేశ్వరుని గిరి ప్రదక్షిణ( Arunachalam Giri Pradakshina )కు వెళ్లే భక్తులకు టీజీఎస్ ఆర్టీసీ( TGSRTC ) శుభవార్త వినిపించింది. పరమశివుడి దర్శనం కోసం అరుణాచలం గిరి ప్రదక్షిణ టూర్ ప్యాకేజీని TGSRTC యాజమాన్యం ప్రకటించింది. ఈ ప్యాకేజీలో కాణిపాకం వరసిద్ధి వినాయకస్వామితో పాటు వెల్లూరులోని గోల్డెన్ టెంపుల్( Golden Temple )ను సందర్శించే సౌకర్యాన్ని సంస్థ కల్పిస్తోంది.
తెలంగాణలోని హైదరాబాద్, ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్, నల్లగొండ, వరంగల్, కరీంనగర్, మహబూబ్‌నగర్ నుంచి అరుణాచలానికి ప్రత్యేక బస్సులను నడుపుడుతున్నట్లు ఆర్టీసీ యాజమాన్యం వెల్లడించింది. ఈ నెల 15న కార్తీక పౌర్ణమి కాగా, 13 నుంచి ఆయా ప్రాంతాల నుంచి ప్రత్యేక బస్సులు బయల్దేరుతాయి. కాణిపాకం, గొల్డెన్ టెంపుల్ దర్శనం తర్వాత కార్తీక పౌర్ణమి పర్వదినం నాడు అరుణాచలానికి చేరుకుంటాయి.
అరుణాచల గిరి ప్రదక్షిణ ప్యాకేజీని http://tgsrtcbus.in వెబ్‌సైట్‌లో బుక్ చేసుకోవచ్చు. పూర్తి వివరాలకు టీజీఎస్ఆర్టీసీ కాల్ సెంటర్ నంబర్లు 040-23450033, 040-69440000 సంప్రదించగలరు.