Yumthang Valley | మండుటెండల్లో చిల్‌ అవ్వాలంటే.. యుమ్తాంగ్ వ్యాలీ వెళ్లాల్సిందే..!

Yumthang Valley | సమ్మర్‌ హాలీడేస్‌ వచ్చేశాయ్‌. మండే ఎండల్లో చల్లని ప్రాంతాలకు వెళ్లి చిల్‌ అవ్వాలని చాలామంది అనుకుంటారు. అలాంటి వారి కోసం సిక్కిం మంచి ప్రదేశమని చెప్పవచ్చు. వేసవిలో సందర్శించేందుకు సిక్కిం బెస్ట్‌ప్లేస్‌. ఇక్కడ చూసేందుకు ఎన్నో పర్యాటక ప్రాంతాలున్నాయి. ఇందులో కీలకమైన ప్రదేశం యుమ్తాంగ్ వ్యాలీ. ఈ సీజన్‌లో ఈ ప్రదేశాన్ని సందర్శిస్తే మరిచిపోలేని అనుభూతిని ఇస్తుంది. ఈ ప్రాంతాన్ని వ్యాలీ ఆఫ్‌ ఫ్లవర్స్‌గా పిలుచుకుంటారు. ఫిబ్రవరి నుంచి జూన్‌ వరకు లోయ అంతా పూలతో నిండిపోతుంది.

  • Publish Date - April 24, 2024 / 12:00 PM IST

ఈ వ్యాలీ సిక్కిం రాజధాని గ్యాంగ్‌టక్‌కు ఉత్తరాన సుమారు 140 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. దీన్ని ‘పూల లోయ’గా పిలుస్తారు. ఇక్కడ విభిన్న రకాల పూలు పర్యాటకులను ఆకర్షిస్తాయి. సిక్కి వెళ్లాలని ఎవరైనా ప్లాన్‌ చేసుకుంటే మాత్రం ఈ వ్యాలీని సందర్శించడం మిస్సవ్వొద్దు. ఈ వ్యాలీ సముద్రమట్టానికి 3,564 మీటర్ల ఎత్తులో ఉంటుంది. అడ్వెంచర్‌ ట్రిప్‌ చేయాల‌నుకునే వారికి, సాహ‌స‌ప్రియుల‌కు ప్రియులకు ఇది బెస్ట్‌ప్లేస్‌గా చెప్పవచ్చు. యుమ్తాంగ్ వ్యాలీలో 24 కంటే ఎక్కువ జాతుల రోడోడెండ్రాన్ పువ్వులు కనిపిస్తాయి. ఇవి ఫిబ్రవరి నుంచి జూన్‌ వరకు వికసిస్తాయి. అనేక రకాల చర్మ సంబంధిత సమస్యలను పోగొట్టే అనేక వేడి నీటి బుగ్గలు సైతం ఈ లోయలో ఉంటాయి. ఇక్కడ ట్రెక్కింగ్‌, క్యాంపింగ్‌ను సైతం ఆస్వాదించే వీలుంది.

ఇక్కడకి వెళ్లేవారు తప్పనిసరిగా పలు జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ ప్రాంతంలో పర్యటించేందుకు తప్పనిసరిగా వెచ్చటి దుస్తులు వెంట తీసుకువెళ్లాలి. ఈ ప్రాంతంలో విపరీతమైన కలి ఉంటుంది. సముద్రమట్టానికి చాలా ఎత్తులో ఉంటుంది. దాంతో వాతావరణం ఎప్పటికప్పుడు మారిపోతూ ఉంటుంది. ఇక్కడికి వెళ్లాలంటే మొదట సిక్కిం రాజధాని గ్యాంగ్‌టక్‌ చేరుకోవాలి. అక్కడి నుంచి లాచుంగ్‌ వెళ్లి.. రాత్రి బస చేసి మరుసటిరోజు యుమ్తాంగ్‌కు బయలుదేరాలి. ఈ వ్యాలీని సందర్శించడానికి అనుమతి అవసరం. కాబట్టి ఇక్కడకు వెళ్లే ముందు ఖచ్చితంగా అనుమతిని తీసుకోవడం మరిచిపోవద్దు. యుమ్తాంగ్ వ్యాలీని సందర్శించేందుకు ఉత్తమ సమయం ఫిబ్రవరి నుంచి జూన్‌ వరకు. ఈ ప్రదేశం సెప్టెంబర్‌ నుంచి డిసెంబర్‌ వరకు మొత్తం మంచుతో కప్పి ఉంటుంది.

Latest News