Site icon vidhaatha

Diabetes: మీలో ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా.. అయితే మీకు షుగర్ ఉన్నట్లే

Diabetes:

ఇటీవల మధుమేహం లాంటి దీర్ఘకాలిక రోగాలు సాధారణంగా కనిపిస్తున్నాయి. తీపి పదార్థాలు తింటేనే డయాబెటిస్ వస్తుందనేది చాలామందిలో ఉన్న ఒక తప్పుడు అభిప్రాయం. నిజానికి, శరీరంలో ఇన్సులిన్ హార్మోన్ ఉత్పత్తి, దాని పనితీరు సరిగా లేకపోవడం వల్లే ఈ వ్యాధి వచ్చే అవకాశాలు ఎక్కువ. డయాబెటిస్‌లో కూడా అనేక రకాలు ఉన్నాయి.

ఈ సమస్య రాకముందు, వచ్చిన తర్వాత శరీరంలో పలు రకాల మార్పులు కనిపిస్తాయి. ముఖ్యంగా రాత్రిపూట నిద్రించే సమయంలో కనిపించే ఈ 5 లక్షణాలు షుగర్ వ్యాధికి సూచనలు కావచ్చు. కాబట్టి, వీటిని గమనిస్తే వెంటనే జాగ్రత్త వహించండి. రాత్రి నిద్రపోతున్నప్పుడు ఈ 5 లక్షణాలు మీకు అనిపిస్తే అప్రమత్తంగా ఉండటం ముఖ్యం. ఇవి డయాబెటిస్ వస్తుందని తెలిపే సంకేతాలు కావచ్చు.

చెమటలు పట్టడం:

రాత్రిపూట చెమటలు పట్టడానికి కారణం రక్తంలో చక్కెర స్థాయి తక్కువగా ఉండటం. అయితే, రాత్రి చెమటలతో పాటు ఇతర లక్షణాలు ఏమైనా ఉంటే డయాబెటిస్ పరీక్ష చేయించుకోవడం మంచిది.

తరచుగా మూత్రవిసర్జన:

ముఖ్యంగా రాత్రి వేళల్లో మామూలు కంటే ఎక్కువసార్లు బాత్రూమ్‌కు వెళ్లడం అధిక రక్తంలోని చక్కెరను సూచిస్తుంది. డయాబెటిస్ కారణంగా రక్తం నుంచి అదనపు చక్కెరను బయటకు పంపడానికి మీ మూత్రపిండాలు ఎక్కువగా శ్రమపడతాయి. మూత్రపిండాలు సరిగా పనిచేయనప్పుడు మూత్రంలో ఎక్కువ చక్కెర వెళుతుంది. దీనివల్ల తరచుగా మూత్రవిసర్జనకు వెళ్లాల్సి వస్తుంది.

ఎక్కువ దాహం:

తరచుగా మూత్రవిసర్జన చేయడం వల్ల శరీరం నీటిని కోల్పోయి డీహైడ్రేషన్‌కు గురవుతుంది, దీనితో ఎక్కువ దాహం వేస్తుంది. కానీ ఎంత నీరు తాగినా దాహం తీరదు. రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు అదుపులో లేనివారిలో ఇతరుల కంటే తక్కువ లాలాజలం ఉత్పత్తి కావడం వల్ల ఈ పరిస్థితి వస్తుంది.

తిమ్మిరి:

రక్త ప్రసరణ సరిగా లేకపోతే నరాలు దెబ్బతినడం వల్ల చేతులు, కాళ్ళలో జలదరింపు, తిమ్మిరి లేదా నొప్పి వస్తాయి.

రాత్రి భోజనం తర్వాత ఆకలి:

డయాబెటిస్ ఉన్నవారికి కడుపు నిండిన తర్వాత కూడా మళ్లీ ఏదైనా తినాలనిపిస్తుంది. దీనిని డయాబెటిక్ హైపర్‌ఫేజియా లేదా పాలీఫేజియా అని కూడా అంటారు. షుగర్ ఉన్నవారు ఈ సమస్యను ఎదుర్కొంటారు. ఎందుకంటే ఇన్సులిన్ సమతుల్యం తప్పడం వల్ల చక్కెర శక్తిగా మారడానికి ఆటంకం కలుగుతుంది.

Exit mobile version