విధాత, హైదరాబాద్ : భద్రాచలం ఆలయ ఈవో రమాదేవిపై పురుషోత్తపట్నం గ్రామస్థులు దాడి చేశారు. ఆలయ భూముల ఆక్రమణలను అడ్డుకునేందుకు వెళ్లిన ఈవో రమాదేవిపైన, ఆలయ సిబ్బందిపైన దాడికి పాల్పడ్డారు. దాడిలో ఈవో రమాదేవి స్పృత తప్పి పడిపోగా..సిబ్బంది వెంటనే ఆమెను ఆసుపత్రికి తరలించారు. గత కొంతకాలంగా దేవాలయ భూముల ఆక్రమణలకు సంబంధించి ఆలయ అధికారులకు, ఆక్రమణదారులకు మధ్య వివాదం కొనసాగుతుంది.
పురుషోత్తపట్నంలో భద్రాద్రి రామాలయానికి 889.50ఎకరాల భూమి ఉంది. భూములను దేవస్థానానికి అప్పగించాలని ఇప్పటికే ఏపీ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. ఆ ఉత్తర్వులను బేఖాతరు చేసి ఆక్రమణదారులు నిర్మాణాలు చేపట్టారు. ఈ క్రమంలో అక్రమ నిర్మాణాలను అడ్డుకునేందుకు వెళ్లిన ఈవో, సిబ్బందిపై ఆక్రమణదారులు దాడికి పాల్పడ్డారు.
భద్రాచలం ఈవో రమాదేవిపై దాడి..
స్పృహ తప్పిన ఈవో రమాదేవి
ప్రైవేట్ ఆస్పత్రికి తరలింపు
భద్రాచలం రామాలయ భూముల కబ్జాని అడ్డుకునేందుకు వెళ్లి ఈవో రమాదేవి
రమాదేవిపై దాడి చేసిన ఆక్రమణదారులు pic.twitter.com/c2sO34k9Jv
— BIG TV Breaking News (@bigtvtelugu) July 8, 2025