Warangal | ఎమ్మెల్యేల నిర్లక్ష్యంతో వరంగల్ ముంపు : ట్రాన్స్ జెండర్ పుష్పిత లయ

వరంగల్ ముంపుకు ఎమ్మెల్యేల నిర్లక్ష్యమే కారణమని ట్రాన్స్ జెండర్ పుష్పిత లయ తీవ్రస్థాయిలో విరుచుకుపడుతూ చీర, గాజులు పంపిస్తామంటూ వ్యాఖ్యలు చేశారు.

విధాత, వరంగల్ ప్రతినిధి: వరంగల్ నగర పరిధిలో గెలుపొందిన మంత్రితో సహా నలుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఎంపీకి పరిపాలన చేయడం రావడంలేదని ట్రాన్స్ జెండర్ పుష్పిత లయ మండిపడ్డారు. వీరి నిర్లక్ష్యం వల్ల వరద ముంపుతో ఎంతోమంది ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అవేదన వ్యక్తం చేశారు. ప్రజా సమస్యలు పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న వారికి చీర, గాజులు పసుపు,కుంకుమలు పంపిస్తామని మీడియా సమావేశంలో తెలిపారు. ఈ దుస్థితికి కబ్జాలు కారణమని విమర్శించారు. ఈ కబ్జాలను నిరోధించడంలో ఈ ఎమ్మెల్యేలు విఫలమయ్యారని అన్నారు. దీంతో వరద నీరు సాఫీగా వెళ్ళకపోవడంతో ముంపునకు గురవుతున్నారని అన్నారు. ఇప్పుడు ఈ విమర్శలు వైరల్ గా మారాయి.