Site icon vidhaatha

‘Hari Hara Veeramallu’| ‘హరి హర వీరమల్లు’ స్పెషల్‌ వీడియో రిలీజ్‌

విధాత : ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ హీరోగా తెరకెక్కిన హరిహర వీరమల్లు మూవీ నుంచి మరో ఆప్ డేట్ వెలువడింది. ఈ నెల 24న ప్రేక్షకుల ముందుకు రానున్నఈ మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా చిత్ర బృందం ప్రత్యేక వీడియోను రిలీజ్‌ చేసింది. ఇప్పటికే రిలీజ్ అయిన ట్రైలర్ అన్ని భాషల్లో కలిపి 61.7 మిలియన్ల వ్యూస్‌ తో కొత్త రికార్డు సృష్టించింది. మెగా సూర్య ప్రొడక్షన్స్‌ పతాకంపై ఏఎం రత్నం నిర్మించిన ఈ పిరియాడికల్ చిత్రంలో వీరమల్లు అనే పోరాటయోధుడి పాత్రలో పవన్‌ కనిపించనున్నారు.

బాబీదేవోల్‌ ఔరంగజేబు పాత్రలో నటిస్తున్నారు. నిధి అగర్వాల్‌, సత్యరాజ్‌, విక్రమ్‌ జీత్‌ తదితరులు కీలకపాత్రలు పోషిస్తున్నారు. ఎం.ఎం. కీరవాణి సంగీతం అందించారు. ఈ మూవీ రెండు భాగాలుగా రానుంది. ధర్మం కోసం యుద్ధం అంటూ ‘హరి హర వీరమల్లు: స్వోర్డ్‌ అండ్‌ స్పిరిట్‌’ ఈనెల 24న తొలి భాగంగా విడుదల కానుంది. పవన్ అభిమానులు ఎంతో ఆత్రంగా ఎదురుచూస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి.

Exit mobile version