Mahesh Babu as Lord Rama First Look on Super Star Krishna’s Birthday? Varanasi Big Update
- ●సూపర్‌స్టార్ కృష్ణ జయంతి (మే 31)న మహేశ్ బాబు శ్రీరాముడి లుక్?
- ●రాజమౌళి ఎలివేషన్‌తో ఫ్యాన్స్‌లో హైప్ పీక్స్
- ●రుద్ర తర్వాత ఇప్పుడు శ్రీరాముడిగా డ్యూయల్ షేడ్‌లో మహేశ్
- ●లీక్ భయంతో లుక్ రివీల్‌పై టీమ్ స్పెషల్ స్ట్రాటజీ
విధాత వినోదం డెస్క్ | హైదరాబాద్:
పాన్ వరల్డ్ స్థాయిలో తెరకెక్కుతున్న దర్శకధీరుడు S. S. Rajamouli – సూపర్ స్టార్ Mahesh Babu కాంబో మూవీ ‘వారణాసి’ నుంచి భారీ సర్ప్రైజ్ రానుంది. ఇప్పటికే రుద్రుడి లుక్‌తో ఆసక్తి రేపిన ఈ ప్రాజెక్ట్‌లో, ఇప్పుడు శ్రీరాముడిగా మహేశ్ బాబు లుక్ రిలీజ్‌కు డేట్ ఫిక్స్ అయ్యిందనే టాక్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది. ఫ్యాన్స్ చాలా కాలంగా ఎదురుచూస్తున్న ఈ రివీల్, ఒక పెద్ద ఈవెంట్‌లా ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం.
“సర్వగుణ సంపన్నుడు శ్రీరాముడు” – రాజమౌళి భారీ ఎలివేషన్
శ్రీరాముడిగా మహేశ్ బాబు కాన్సెప్ట్ లుక్స్ – సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఫ్యాన్ మేడ్ విజువల్స్ – AI images
ఈ సినిమాలో శ్రీరాముడి పాత్ర గురించి రాజమౌళి ఇచ్చిన వివరణ అంచనాలను మరింత పెంచింది. “ఊహించనంత అందం, పరాక్రమం, ప్రేమ, ఆవేశం… అన్నీ కలిసిన సంపూర్ణ శ్రీరాముడు”గా మహేశ్ కనిపిస్తాడని ఆయన ప్రకటించాడు.
ఈ వ్యాఖ్యలతో, ఇది కేవలం పౌరాణిక పాత్ర మాత్రమే కాకుండా, భావోద్వేగ తీవ్రతతో కూడిన శక్తివంతమైన పాత్ర అని స్పష్టమవుతోంది.
ఇక మహేశ్‌ను శ్రీరాముడిగా లుక్ టెస్ట్ చేసినప్పుడు తీసిన ఫోటోను రాజమౌళి తన ఫోన్ వాల్‌పేపర్‌గా పెట్టుకున్నానని చెప్పడం… అదెంత గొప్పగా ఉందో, దైవత్వాన్ని ఎలా ప్రదర్శించిందో తెలిసిపోతోంది. అయితే లీక్ అవుతుందన్న భయంతో దాన్ని డిలీట్ చేయాల్సి వచ్చిందని చెప్పడం ఆసక్తికరంగా మారింది.
మే 31న తొలగనున్న సస్పెన్స్ ? – లీక్ భయంతో స్పెషల్ ప్లాన్!
పరిశ్రమ వర్గాల నుండి అందుతున్ని విశ్వసనీయ సమాచారం మేరకు, సూపర్ స్టార్ కృష్ణ జయంతి (మే 31) సందర్భంగా రాజమౌళి శ్రీరాముడి లుక్ విడుదల చేసే ప్లాన్‌లో ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఈసారి ఎలాంటి లీకులు జరగకుండా రాజమౌళి టీం ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటోంది. గతంలో టైటిల్ గ్లింప్స్ సమయంలో లుక్స్ ముందే లీక్ కావడంతో, ఈసారి సోషల్ మీడియాలో డైరెక్ట్ రిలీజ్ చేయాలా? లేదా థియేటర్లలో ప్రత్యేకంగా విడుదల చేయాలా అనే అంశంపై ఇంకా ఫైనల్ నిర్ణయం తీసుకోలేదు. కానీ ఏ రూపంలో వచ్చినా… తక్షణం వైరల్ అయ్యే విషయం అనేది మాత్రం పక్కా.
రెండు పాత్రల్లో కనువిందు
వారణాసిలో విలన్ కుంభగా పృథ్వీరాజ్ సుకుమారన్, మందాకినిగా ప్రియాంక చోప్రా – పవర్‌ఫుల్ క్యారెక్టర్ లుక్స్
ఈ సినిమాలో మహేశ్ బాబు రెండు విభిన్న రూపాల్లో కనిపించనున్నాడు. రుద్రగా ఇప్పటి రూపాన్ని ఇప్పటికే చూసాం. ఇక శ్రీరాముడి గెటప్‌లో చూడాల్సిఉంది. ఈ రెండు వేర్వేరు పాత్రలు కాబట్టి, దీన్ని ద్విపాత్రాభినయంగానే పరిగణించాలి.
ఇది సినిమాలోని ప్రధాన ఆకర్షణగా నిలవనుంది. ఇక షూటింగ్ విషయానికి వస్తే, ఇప్పటికే సుమారు 70% షూటింగ్ పూర్తి చేసుకున్న వారణాసి, ప్రస్తుతం హైదరాబాద్‌లో ప్రియాంకా చోప్రాతో కీలక సన్నివేశాలు చిత్రీకరిస్తున్నట్లు తెలుస్తోంది. పవర్‌ఫుల్ ప్రతినాయకుడిగా కుంభ పాత్రలో మలయాళ సూపర్‌స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్ నటిస్తున్నట్లు తెలిసిందే. తన పాత్ర చిత్రీకరణ పూర్తయిందని తనే ఈ మధ్య సోషల్ మీడియాలో ప్రకటించాడు.
భారీ బడ్జెట్ – కళ్లు చెదిరే గ్రాఫిక్స్
ఇక ఈ సినిమా సుమారు ₹1300 కోట్ల భారీ బడ్జెట్‌తో రూపొందనుండగా, భారీ తారాగణం, అద్భుతమైన విజువల్ ఎఫెక్ట్స్‌తో కనువిందు చేయనుంది. విఎఫ్ఎక్స్ కోసం ప్రత్యేకంగా 3 కంపెనీలు పనిచేస్తున్నాయి. వీటికోసం తాత్కాలికంగా హైదరాబాద్‌లో ఒక ప్రత్యేక స్టుడియో ఏర్పాటు చేసారంటేనే ఎంత ప్రతిష్టాత్మకంగా గ్రాఫిక్స్ ఉండబోతున్నయో అర్థమవుతోంది. ఈ సినిమా ఐమాక్స్, డాల్బీ విజన్ పరిజ్ఞానంతో తెరకెక్కుతూ, ప్రపంచవ్యాప్తంగా విడుదలకు సిద్ధమవుతోంది.
మొత్తానికి, మహేశ్ బాబు శ్రీరాముడిగా కనిపించే ఆ లుక్… కేవలం ఫస్ట్ లుక్ కాకుండా సినిమా స్థాయిని నిర్వచించే సందర్భంగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. మే 31 కోసం ఫ్యాన్స్ ఇప్పుడు కౌంట్‌డౌన్ మొదలుపెట్టేశారు.
