Fridge Cooling Tips | ఎండాకాలంలో మీ ఫ్రిజ్‌లో పెట్టిన వస్తువులు తొందరగా పాడైపోతున్నాయా? మీ రిఫ్రిజిరేటర్ ఎక్కువగా కూల్ అవ్వడం లేదని అనిపిస్తుందా? దీనికోసం మీరు కొత్తది మార్చాల్సిన అవసరం లేదు. ఇప్పుడున్న ఫ్రిజ్‌లోనే చిన్నపాటి మార్పులు చేస్తే కూలింగ్‌ను మళ్లీ పెంచుకోవచ్చు.
ఫ్రిజ్ డోర్ రబ్బర్ సీల్ చెక్ చేయాలి.
రిఫ్రిజిరేటర్ కూలింగ్ ఎక్కువగా అవ్వడం లేదని అనిపిస్తే ముందుగా డోర్ వద్ద కనిపించే గ్యాస్కెట్ (రబ్బర్ సీల్)ను చెక్ చేయాలి. అది వదులుగా అయిపోయి.. సరిగ్గా అతుక్కోకపోతే లోపలి చల్లటి గాలి బయకు వెళ్లిపోతుంది. దీంతో ఎంతసేపు ఫ్రిజ్ ఆన్‌లో ఉన్నా కూలింగ్ ఉండదు. ఒకవేళ అది వదులైపోయినా.. పాడైపోయినా వెంటనే కొత్తది మార్చుకోవడం మంచిది.
కండెన్సర్ కాయిల్స్ శుభ్రం చేయాలి
ఫ్రిజ్ వెనుక భాగంలో ఉండే కండెన్సర్ కాయిల్స్‌పై దుమ్ము ధూళి చేరుకుపోతే వేడి బయటకు వెళ్లదు. దీంతో కూలింగ్ తగ్గిపోతుంది. కాబట్టి కనీసం సంవత్సరానికి ఒకటి రెండు సార్లు బ్రష్ లేదా వ్యాక్యూమ్ క్లీనర్‌తో శుభ్రం చేసుకోవాలి.
గోడ దగ్గర పెట్టవద్దు
చాలామందికి ఫ్రిజ్‌ను గోడకు దగ్గరగా పెట్టడం అలవాటు. కానీ అది మంచి పద్ధతి కాదు. ఫ్రిజ్ వెనుక భాగానికి, గోడకు మధ్య కనీసం 4 నుంచి ఆరు అంగుళాల గ్యాప్ ఉండాలి. అప్పుడే గాలి ప్రసరణ మంచిగా జరుగుతుంది. అప్పుడు కంప్రెసర్ వేడెక్కకుండా ఉంటుంది. అలాగే ఫ్రిజ్‌ను స్టవ్ దగ్గర, నేరుగా ఎండ తగిలే ప్రదేశాల్లో పెట్టకపోవడం కూడా ముఖ్యం.
సెట్టింగ్స్ చూసుకోవాలి.
ఫ్రిజ్ లోపలి ఉష్ణోగ్రతను వాతావరణాన్ని బట్టి మార్చుకోవాలి. వేసవిలో ఎక్కువ కూలింగ్ అవసరం ఉంటుంది కాబట్టి.. కూలింగ్ పెంచుకోవాలి. సాధారణంగా 3°C నుంచి 5°C ఉంచితే బెటర్. అదే ఫ్రీజర్ అయితే -18°C వద్ద ఉంచాలి.
ఆహార పదార్థాల అమరిక కూడా ముఖ్యమే
ఫ్రిజ్‌లో ఆహార పదార్థాలను ఎలా పెడుతున్నామనే దాన్ని బట్టి కూడా కూలింగ్ ప్రభావం చూపిస్తుంది. ఎయిర్ వెంట్స్‌ను బ్లాక్ చేసేలా డబ్బాలు, కవర్లను పెట్టకూడదు. అలాగే ఫ్రిజ్‌ను ఎక్కువ సామన్లతో నింపేయకూడదు. లోపల కలిగి ప్రసరణ జరిగేలా ఉంచాలి.
వేడి పదార్థాలు డైరెక్ట్‌గా పెట్టవద్దు
చాలామంది వేడి పదార్థాలను నేరుగా ఫ్రిజ్‌లో పెట్టేస్తుంటారు. దీనివల్ల లోపలి ఉష్ణోగ్రత పెరిగి కంప్రెసర్‌పై భారం, ఒత్తిడి పడుతుంది. దీనివల్ల కంప్రెసర్ పాడయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఏవైనా ఆహార పదార్థాలు పూర్తిగా చల్లారిన తర్వాతనే ఫ్రిజ్‌లో ఉంచాలి.
పదే పదే డోర్ తెరవద్దు
ఫ్రిజ్ డోర్‌ను పదే పదే తెరవడం లేదా ఎక్కువసేపు ఓపెన్‌గా ఉంచడం ద్వారా కూడా కూలింగ్ తగ్గిపోతుంది. తలుపు తీసినప్పుడు బయటి వేడిగాలి లోపలికి వెళ్లి టెంపరేచర్ పెరుగుతుంది. మళ్లీ కూల్ కావడానికి టైమ్ పడుతుంది. కాబట్టి అవసరమైనప్పుడు మాత్రమే ఫ్రిజ్ డోర్ ఓపెన్ చేయాలి. వెంటనే క్లోజ్ చేయాలి.
ఐస్ పేరుకుపోకుండా చూసుకోవాలి.
మాన్యువల్ డిఫ్రాస్ట్ ఫ్రిజ్‌లో మంచు పేరుకుపోవడం ఒక సమస్య. ఇలా ఐస్ పొర ఎక్కువ అయినప్పుడు డిఫ్రాస్ట్ చేయాలి. గడ్డకట్టిన ఐస్‌ను తీసేయాలి. దీనివల్ల ఇది కూలింగ్‌ను మెరుగుపరచడమే కాకుండా విద్యుత్ వినియోగాన్ని ఆదా చేస్తుంది.
Read More:
Household Tips | ఫ్రిజ్‌లో నుంచి దుర్వాసన వస్తుందా? ఈ సింపుల్ చిట్కాలతో సమస్యను దూరం చేయండి!
Pillow Cleaning Tips | దిండుపై నూనె మరకలు పోవట్లేదా.. ఇంట్లోనే ఉండే ఈ వస్తువులతో క్లీన్ చేసి చూడండి!
