విధాత : పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులతో బంగారం, వెండి ధరలు తీవ్ర ఒడిదుడుకులకు లోనవుతున్నాయి. శనివారం బులియన్ మార్కెట్ లో 24క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర ర.490 పెరిగి రూ 1,52,840 వద్ద కొనసాగుతుంది. 22క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర రూ. 450 పెరిగి రూ. 1,40,100 వద్ద నిలిచింది. కిలో వెండి ధర రూ.2,65,000వద్ద స్థిరంగా కొనసాగుతుంది.
పశ్చిమాసియా యుద్ద పరిస్థితుల కారణంగా బంగారం ధరలు ఎప్పుడు ఎలా మారుతున్నాయో పసిడి ప్రియులకు అర్థం కావడం లేదు. ప్రస్తుతం ఉద్రిక్త పరిస్థితులు కుదుటపడుతున్నాయనే ఆశలు పెట్టుబడిదారుల్లో రేకెత్తుతున్నాయి. దీంతో వారు పసిడి మీద పెట్టుబడులను ఆచితూచి పెట్టాల్సిన పరిస్థితులు ఎదురవుతున్నాయి. క్రమంగా పసిడి ధరలు పుంజుకుంటున్నాయి. శాంతియుత పరిస్థితులు కొనసాగితే బంగారం, వెండి ధరలు మళ్లీ పరుగులు పెట్టడం ఖాయం అని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు.
