మరింత తగ్గిన బంగారం, వెండి ధరలు

బులియన్ మార్కెట్ లో గురువారం 24క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర రూ. 2,230 తగ్గి రూ. 1,56,060వద్ద కొనసాగుతుంది. 22క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర రూ 2,050 తతగ్గి రూ. 1,43,050 వద్ద నిలిచింది. కిలో వెండి ధర రూ. 5,000 తగ్గి రూ. 2,85,000వద్ద కొనసాగుతుంది.

Reported by: Y.V. Narsimha Reddy | వాణిజ్యం | May 28, 2026, 1:08 pm IST
Read Time: 5 mins
మరింత తగ్గిన బంగారం, వెండి ధరలు

విధాత, హైదరాబాద్ : పశ్చిమాసియాలో నెలకున్న ఉద్రిక్త పరిస్థితుల మధ్య పసిడి ధరలు హెచ్చుతగ్గులకు లోనవుతున్నాయి. గత మూడు రొజుల నుంచి బంగారం ధరలు తగ్గుతూ వస్తున్నాయి. గురువారం కూడా బంగారం,వెండి ధరలు మరింత తగ్గి..సామాన్యులను ఊపిరి పీల్చుకునేలా చేశాయి. బులియన్ మార్కెట్ లో గురువారం 24క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర రూ. 2,230 తగ్గి రూ. 1,56,060వద్ద కొనసాగుతుంది. 22క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర రూ 2,050 తతగ్గి రూ. 1,43,050 వద్ద నిలిచింది. కిలో వెండి ధర రూ. 5,000 తగ్గి రూ. 2,85,000వద్ద కొనసాగుతుంది.

తగ్గని ఉద్రికత్తలలో ధరల్లో కొనసాగుతున్న అస్థిరత

అంతర్జాతీయ మార్కెట్లో నెలకొన్న భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్ల నిర్ణయాలపై ఉన్న సస్పెన్స్ నేపథ్యంలో సమీప భవిష్యత్తులో బంగారం ధరల పెరుగుదల ఒక పరిమిత పరిధిలోనే ఉండే అవకాశం ఉందని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. ముఖ్యంగా అంతర్జాతీయంగా పెరిగిన ముడి చమురు ధరలు ద్రవ్యోల్బణ ఆందోళనలను మరింత పెంచాయి. దీనివల్ల అమెరికా ఫెడరల్ రిజర్వ్ దూకుడుగా వడ్డీ రేట్లను తగ్గిస్తుందనే అంచనాలు మార్కెట్లో తగ్గిపోయాయి. అటు అమెరికా-ఇరాన్ వ్యవహారాలు చూస్తే, ఒకవైపు ఖతార్ వంటి దేశాల మధ్యవర్తిత్వంతో రాయబార చర్చలు జరుగుతున్నప్పటికీ, క్షేత్రస్థాయిలో మాత్రం పరస్పర దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. కొత్తగా ఓమన్, క్యూబాలపై దాడులు చేస్తామని అమెరికా హెచ్చరికలు చేస్తుంది. ఈ పరిణామాలకు తోడు.

కీలకంగా అమెరికా ఫెడరల్ రిజర్వ్ ఆర్థిక గణాంకాలు

గురువారం విడుదల కానున్న అమెరికా ఆర్థిక గణాంకాలు. ఫెడరల్ రిజర్వ్ అత్యంత ప్రాధాన్యతనిచ్చే ద్రవ్యోల్బణ కొలమానం ‘కోర్ PCE ధరల సూచీ’ (Core PCE Price Index) పై అందరి దృష్టి నెలకొంది. ఒకవేళ ఈ ద్రవ్యోల్బణ డేటా అంచనాల కంటే బలంగా వస్తే, అది అమెరికన్ డాలర్‌కు మరియు బాండ్ దిగుబడులకు (Bond Yields) బలాన్ని ఇస్తూ బంగారం ధరలపై ఒత్తిడిని పెంచుతుంది. ఒకవేళ ద్రవ్యోల్బణ గణాంకాలు బలహీనంగా నమోదైతే, ఫెడ్ వడ్డీ రేట్ల సడలింపు అంచనాలు మళ్లీ చిగురించి పసిడి ధరలకు మద్దతు లభిస్తుంది.

ధరలు పెరిగే ఛాన్స్ తక్కువే ?

దీర్ఘకాలిక అంతరాయాలు, పెరిగిన చమురు ధరల ప్రభావంతో ద్రవ్యోల్బణం కనీసం మరో రెండు నెలల పాటు ఇదే విధంగా ఎక్కువగా ఉండే అవకాశం ఉన్నందున, స్వల్పకాలంలో బంగారం ధరలు బలంగా పెరిగే ఛాన్స్ చాలా తక్కువ. అయితే ఈ ధరల తగ్గుదల అనేది దీర్ఘకాలిక పెట్టుబడిదారులకు డిప్స్ లో కొనుగోలు చేయడానికి ఒక మంచి అవకాశంగా మారనుంది. కాబట్టి ట్రేడర్లు ధరలను దూకుడుగా వెంబడించకుండా, తగ్గినప్పుడల్లా క్రమంగా కొనుగోలు చేయడం ఉత్తమం అని నిపుణులు చెబుతున్నారు.