తగ్గిన బంగారం..నిలకడగా వెండి ధరలు

మంగళవారం బులియన్ మార్కెట్ లో 24క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర రూ. 490 తగ్గి రూ.1,58,890వద్ద కొనసాగుతుంది. 22క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర రూ. 450 తగ్గి రూ. 1,45,650వద్ద నిలిచింది. కిలో వెండి ధర రూ. 2,50,000 వద్ద కొనసాగుతుంది.

Reported by: Y.V. Narsimha Reddy | వాణిజ్యం | May 26, 2026, 12:20 pm IST
Read Time: 2 mins
తగ్గిన బంగారం..నిలకడగా వెండి ధరలు

పశ్చిమాసియా ఉద్రిక్తతల ప్రభావం బంగారం, వెండి ధరలు మీద పడుతోంది. ఇరాన్ నౌకలపై అమెరికా తాజాగా దాడులు మొదలు పెట్టడంతో బులియన్ మార్కెట్ తీవ్ర ఒడిదుడుకులకు లోనవుతోంది. అమెరికా-ఇరాన్ మధ్య శాంతి ఒప్పందంపై ఇంకా నీలి నీడలు కమ్ముకున్నాయి. దీంతో పసిడి ధరలతో పాటు స్టాక్ మార్కెట్ కూడా తీవ్రంగా ప్రభావితమవుతోంది. ఈ నేపథ్యంలో బంగారం ధరలు స్వల్పంగా తగ్గుదలను నమోదు చేయగా, వెండి ధరలు స్థిరంగా ఉన్నాయి.

మంగళవారం బులియన్ మార్కెట్ లో 24క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర రూ. 490 తగ్గి రూ.1,58,890వద్ద కొనసాగుతుంది. 22క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర రూ. 450 తగ్గి రూ. 1,45,650వద్ద నిలిచింది. కిలో వెండి ధర రూ. 2,50,000 వద్ద కొనసాగుతుంది.

ఇవి కూడా చదవండి :

ఆ ముగ్గురి ఐపీఎస్ లను సస్పెండ్ చేసిన సీఎం విజయ్
Knife sharpeners | హైద‌రాబాద్‌లో క‌త్తుల‌కు ప‌దును.. రోజుకు రూ. 2 వేల సంపాద‌న‌..!