ఆ ముగ్గురి ఐపీఎస్ లను సస్పెండ్ చేసిన సీఎం విజయ్
పదేళ్ల బాలికపై హత్యాచారం కేసు వివరాలను మీడియా సమావేశంలో వెల్లడించే క్రమంలో జోకులు వేసుకుంటూ, నవ్వుకుంటూ, గోళ్ల రాసుకుంటూ అనుచితంగా వ్యవహరించిన వ్యవహారంలో సీఎం విజయ్ సీరియస్ గా స్పందించారు. కోయంబత్తూరు వెస్ట్ జోన్ ఐజీ రమ్య భారతి సహా డీఐజీ, ఎస్పీ ముగ్గురు అధికారులను విజయ్ ఉద్యోగాల నుంచి సస్పెండ్ చేశారు.
పదేళ్ల బాలికపై హత్యాచారం కేసు వివరాలను మీడియా సమావేశంలో వెల్లడించే క్రమంలో జోకులు వేసుకుంటూ, నవ్వుకుంటూ, గోళ్ల రాసుకుంటూ అనుచితంగా వ్యవహరించిన వ్యవహారంలో సీఎం విజయ్ సీరియస్ గా స్పందించారు. కోయంబత్తూరు వెస్ట్ జోన్ ఐజీ రమ్య భారతి సహా డీఐజీ, ఎస్పీ ముగ్గురు అధికారులను విజయ్ ఉద్యోగాల నుంచి సస్పెండ్ చేశారు.
తమిళనాడు రాష్ట్రంలో కోయంబత్తూర్ జిల్లాలో ఓ పదేళ్ల బాలికపై ఘోరం జరిగింది. ఆమెను కొంతమంది వ్యక్తులు అపహరించి..అత్యాచారం చేసి హత్య చేశారు. ఈ సంఘటనపై ముఖ్యమంత్రి విజయ్ వెంటనే స్పందించారు. అంతేకాదు జరిగిన ఘటనపై తీవ్రమైన దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బాధిత కుటుంబానికి సంబంధిత ఎమ్మెల్యే పరామర్శించారు. నేరుగా ముఖ్యమంత్రి నుంచి ఆదేశాలు రావడంతో విచారణను వేగవంతం చేశారు. ఫలితంగా ఈ ఘటనకు పాల్పడిన ముగ్గురు వ్యక్తులను అరెస్ట్ చేశారు. ఈ కేసుకు సంబంధించిన విషయాలను చెప్పడానికి ఒక మహిళ ఐజీ అధికారి.. ఇద్దరు ఐపీఎస్ అధికారులు విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు.
ప్రెస్ మీట్‌లో వారు ముగ్గురు నవ్వుతూ కనిపించారు. ముఖ్యంగా మహిళ ఐజీ అధికారి అయితే తోటి ఐపీఎస్ అధికారులతో సరదాగా నవ్వుతూ ముచ్చటించారు. గోర్లు గిల్లుతూ.. ఈ సంఘటనపై అత్యంత నిర్లక్ష్యంగా వ్యవహరించారు. ముగ్గురు ఐపీఎస్ ల నవ్వులాట దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవ్వగా..వారి బాధ్యతారాహిత్యంపై దేశ వ్యాప్తంగా విమర్శలు వెల్లువెత్తాయి.
ఒక బాలిక చనిపోతే కొంచెం కూడా మానవత్వం లేదా అంటూ నెటిజన్లు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. నువ్వు కూడా ఒక మహిళవే కదా.. నీక్కూడా పెళ్లయి ఉంటుంది కదా.. నీకు పిల్లలు ఉండి ఉంటారు కదా.. ఒకవేళ జరిగిన ఘటనలో చనిపోయింది నీ కూతురైతే నువ్వు ఇలానే వ్యవహరిస్తావా అంటూ మహిళా ఐజీ అధికారిపై సోషల్ మీడియాలో విమర్శలు వ్యక్తం అయ్యాయి. ఇది కాస్త ముఖ్యమంత్రి విజయ్ దృష్టికి వెళ్లింది. విజయ్ వెంటనే స్పందించారు. ఆ ముగ్గురు ఐపీఎస్ అధికారులను సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఒక కేసు వ్యవహారంలో పోలీసులు నిజాలు చెప్పేటప్పుడు ఇలా వ్యవహరించకూడదని సూచించారు.
ప్రజలకు పోలీసులు జవాబుదారీగా ఉండాలని.. శాంతి భద్రతలను పరిరక్షించాలని సూచించారు. దారుణంగా వ్యవహరించే అధికారుల మీద ఏమాత్రం జాలి చూపించాల్సిన అవసరం లేదని విజయ్ ఘాటుగా వ్యాఖ్యానించారు. ఈ మేరకు తన ట్విట్టర్ ఖాతాలో సుదీర్ఘ పోస్ట్ పెట్టారు. జరిగిన ఘటనపై తాను విచారం వ్యక్తం చేస్తున్నానని.. పోలీసులు ఇకపై ఇలా వ్యవహరించకూడదని ఆయన సూచించారు. అందువల్లే ఆ ముగ్గురు అధికారులపై సస్పెండ్ వేటు వేస్తున్నట్టు వెల్లడించారు.
కోయంబత్తూర్ చిన్నారి అత్యాచారం-హత్య కేసు బ్రీఫింగ్‌కు ముందు ప్రెస్మీట్లో నవ్విన తమిళనాడు ఐజీపై విమర్శలు రాగా, అదే తరహాలో నవ్విన ముగ్గురు ఐపీఎస్‌లను సీఎం విజయ్ సస్పెండ్ చేశారు. pic.twitter.com/NuR81EvdaN
— TG Govt Updates (@TGGovtUpdates) May 25, 2026
ఇవి కూడా చదవండి :
Heat Wave | నిప్పుల కొలిమిలా రాష్ట్రం.. మరో మూడు రోజులు మండుటెండలే..!
Self Driving Truck | హైవేలపై సరికొత్త విప్లవం.. డ్రైవర్లు లేకుండా ఏఐతో రోడ్లపై పరుగులు పెట్టే ట్రక్కులు.. వీటితో లాభమా? నష్టమా?
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram