Honor Win Turbo | ప్రముఖ స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ హానర్ సరికొత్త మొబైల్‌ను తీసుకొచ్చింది. 10,000mAh భారీ బ్యాటరీ కెపాసిటీతో Honor Win Turbo స్మార్ట్‌ఫోన్‌ను చైనాలో విడుదల చేసింది. మీడియాటెక్ డైమెన్సిటీ 8500 రేసింగ్ ఎడిషన్ చిప్‌సెట్‌తో పాటు హైఎండ్ డిస్‌ప్లే ఫీచర్లతో ఈ ఫోన్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది

ఐ ప్రొటెక్షన్ డిస్‌ప్లే

Honor Win Turbo మొబైల్‌లో 6.79 అంగుళాల 1.5K AMOLED ఒయాసిస్ ఐ ప్రొటెక్షన్ డిస్‌ప్లేను అందించారు. ఇది 120Hz రీఫ్రెష్ రేట్, 3840Hz PWM డిమ్మింగ్, 8000 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌ను సపోర్టు చేస్తుంది. 94.62 శాతం స్క్రీన్ టు బాడీ రేషియోతో వీడియోలు, గేమింగ్‌కు మరింత మెరుగైన అనుభవం లభిస్తుందని హానర్ కంపెనీ వెల్లడించింది. దీని డిస్‌ప్లే ఎంతసేపు చూసినా కంటిపై ప్రభావం పడకుండా ఉంటుందని పేర్కొంది.

లిఫ్ట్‌లు, అండర్‌గ్రౌండ్‌లోనూ ఫుల్ నెట్‌వర్క్

పనితీరు విషయానికి వస్తే ఈ ఫోన్‌లో మీడియాటెక్ డైమెన్సిటీ 8500 రేసింగ్ ఎడిషన్ చిప్‌సెట్‌తో పాటు మాలి-G720 MC8 జీపీయూ అందించారు. గరిష్టంగా 16GB LPDDR5X ర్యామ్, 512GB UFS 4.1 స్టోరేజ్ వరకు వేరియంట్లు అందుబాటులో ఉన్నాయి. ఇక నెట్‌వర్క్ సరిగ్గా లేని ప్రాంతాల్లో కూడా స్థిరమైన కమ్యూనికేషన్ కోసం ప్రత్యేకంగా C1+RF ఎన్‌హ్యాన్స్‌మెంట్ చిప్‌ను అమర్చినట్లు హానర్ కంపెనీ తెలిపింది. దీనివల్ల లిఫ్ట్‌లు, అండర్‌గ్రౌండ్ పార్కింగ్, హైస్పీడ్ రైల్వే స్వేషన్లలోనూ కనెక్టివిటీ మెరుగ్గా ఉంటుందని పేర్కొంది.

బ్యాటరీనే మెయిన్ హైలైట్

ఈ ఫోన్‌లో మెయిన్ హైలైట్ బ్యాటరీ అనే చెప్పొచ్చు. ఈ స్మార్ట్‌ఫోన్ 10,000mAh భారీ బ్యాటరీతో వస్తుంది. 80W వైర్డ్‌ ఫాస్ట్ చార్జింగ్‌తో పాటు 27W రివర్స్ చార్జింగ‌కు మద్దతు ఇస్తుంది. దీన్ని ఒక్కసారి ఫుల్ చార్జ్ చేస్తే 17.3 గంటల నావిగేషన్, 14.2 గంటల గేమింగ్ సపోర్టు చేస్తుందని హానర్ కంపెనీ వెల్లడించింది.

కెమెరా ఫీచర్లు

కెమెరా విషయానికి వస్తే.. దీని వెనుక భాగంలో డ్యూయల్ రియర్ సెటప్ అందించారు. ఇందులో OIS సపోర్ట్‌తో 50మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, 5 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ కెమెరా ఉన్నాయి. సెల్ఫీలు, వీడియోకాలింగ్ కోసం 16మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా అందించారు. ఫోన్ వేడెక్కకుండా ఉండేందుకు 40వేల చదరపు మిల్లీమీటర్ల లిక్వి్డ కూలింగ్ వ్యవస్థను కూడా ఇందులో అమర్చారు.

ఇతర స్పెసిఫికేషన్లు

కనెక్టివిటీ పరంగా హానర్ విన్ టర్బో మొబైల్‌లో 5G, Bluetooth 6.0, GPS, NFC, OTG, USB Type C పోర్ట్ వంటి సదుపాయాలు ఉన్నాయి. ఇందులో డ్యూయల్ స్పీకర్లు, డ్యూయల్ మైక్రోఫోన్లు ఫింగర్‌ప్రింట్ సెన్సార్‌ను అందించారు. IP 66, IP68, IP69K వాటర్ డస్ట్ రెసిస్టెన్స్ రేటింగ్స్‌తో పాటు SGS ఫైవ్‌స్టార్ డ్రాప్, షాక్, క్రష్ రెసిస్టెన్స్ సర్టిఫికేషన్ పొందినట్లు హానర్ కంపెనీ తెలిపింది.

ధర ఎంతంటే..!

ధర విషయానికి వస్తే 12జీబీ ర్యామ్+256జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర చైనాలో సుమారు రూ.46వేల వరకు ఉంది. 12జీబీ ర్యామ్+512జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.50 వేల వరకు ఉంది. 16జీబీ+512జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.60 వేల వరకు ఉండొచ్చని సమాచారం. ఈ మొబైల్ బ్లాక్, బ్లూ, వైట్ కలర్ ఆప్షన్లలో అందుబాటులో ఉంది.