OnePlus 16 | 200మెగాపిక్సెల్ కెమెరా.. ఏఐ బటన్‌.. వన్‌ప్లస్ 16 స్పెసిఫికేషన్లు లీక్!

OnePlus 16 | ప్రముఖ స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ వన్‌ప్లస్ నుంచి త్వరలోనే OnePlus 16 మొబైల్ రాబోతుంది. ఈ నేపథ్యంలో ఆ స్మార్ట్‌ఫోన్‌కు సంబంధించిన ఆసక్తికరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి.

Reported by: Chandram | సైన్స్​ – టెక్నాలజీ | May 28, 2026, 10:30 pm IST
Read Time: 5 mins
OnePlus 16 | 200మెగాపిక్సెల్ కెమెరా.. ఏఐ బటన్‌.. వన్‌ప్లస్ 16 స్పెసిఫికేషన్లు లీక్!

OnePlus 16 | ప్రముఖ స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ వన్‌ప్లస్ నుంచి త్వరలోనే OnePlus 16 మొబైల్ రాబోతుంది. ఈ నేపథ్యంలో ఆ స్మార్ట్‌ఫోన్‌కు సంబంధించిన ఆసక్తికరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి. అత్యాధునిక డిస్‌ప్లే, 200మెగాపిక్సెల్‌ కెమెరాతో పాటు ప్రత్యేక ఏఐ బటన్‌తో మార్కెట్‌లోకి వచ్చే అవకాశం ఉందని టెక్ నిపుణులు చెబుతున్నారు.

వన్‌ప్లస్ 16 మొబైల్ ఫీచర్ల గురించి కంపెనీ అధికారికంగా ఎటువంటి వివరాలు వెల్లడించలేదు. కానీ ఈ హ్యాండ్‌సెట్ ప్రస్తుతం టెస్టింగ్ దశలో ఉన్నట్లు తెలుస్తోంది. టెక్ విశ్లేషకుల అంచనా ప్రకారం.. ఈ మొబైల్ 185Hz రీఫ్రెష్ రేటుతో కూడిన డిస్‌ప్లేను పరీక్షిస్తోంది. గతంలో ఈ ఫోన్‌లో 240Hz వరకు రీఫ్రెష్‌రేట్ ఉండొచ్చని ప్రచారం జరిగింది.. కానీ తాజా లీకుల ప్రకారం ఇది 185Hz డిస్‌ప్లేకే పరమితమైనట్లు తెలుస్తోంది. అయినప్పటికీ ఇప్పటివరకు వచ్చిన వన్‌ప్లస్ ఫోన్లలో ఇదే అత్యధిక రీఫ్రెష్‌రేట్ కలిగిన డిస్‌ప్లే కావడం గమనార్హం. ప్రస్తుతం వన్‌ప్లస్ 15 సహా మరికొన్ని మోడళ్లలో అత్యధికంగా 165Hz రీఫ్రెస్‌ రేట్ డిస్‌ప్లే ఉంది.

అంతేకాదు ఈ మొబైల్‌లో నాలుగు వైపులా అతి సన్నని బెజెల్స్‌తో ఫ్లాట్ OLED స్క్రీన్ ఉండొచ్చని సమాచారం. అలాగే 1.5K రిజల్యూషన్‌తో LTPO, LIPO ప్యాకేజింగ్ టెక్నాలజీని వినియోగించే అవకాశం ఉందని తెలుస్తోంది. దీనివల్ల స్క్రీన్‌చుట్టూ బెజెల్స్ దాదాపు ఒక మిల్లీ మీటర్ వరకు తగ్గే అవకాశం ఉంది.

కెమెరా స్పెసిఫికేషన్లలోనూ వన్‌ప్లస్ భారీ మార్పులే తీసుకొస్తున్నట్లు లీకుల ద్వారా తెలుస్తోంది. వన్‌ప్లస్ 16 మోడల్‌లో 3x పెరిస్కోప్ టెలిఫొటో కెమెరాతో పాటు 200 మెగాపిక్సెల్ సెన్సార్‌ను అందించే అవకాశం ఉందని సమాచారం. జూమ్ ఫొటోగ్రఫీని మరింత మెరుగుపరచడంపై కంపెనీ దృష్టి పెట్టినట్లు టెక్‌వర్గాలు భావిస్తున్నాయి.

వీటితో పాటు వన్‌ప్లస్ 16 మొబైల్‌లో ప్రత్యేక ఏఐ బటన్‌ను కూడా అందించవచ్చని ప్రచారం సాగుతోంది. అయితే అది ఏవిధంగా పనిచేస్తుంది? వినియోగదారులకు ఏ సదుపాయాలు అందిస్తుందనే దానిపై ఇంకా స్పష్టత రాలేదు.

ప్రాసెసర్‌ విషయానికి వస్తే Qualcomm Snapdragon 8 ఎలైట్ జెన్5 తర్వాతి అప్‌డేట్ చిప్‌సెట్‌ను ఇందులో వినియోగించే అవకాశం ఉందని సమాచారం. ఇక బ్యారటీ సామర్థ్యం కూడా 7000mAh వరకు ఉండొచ్చని ప్రచారం జరుగుతోంది. గత మోడళ్ల తరహాలోనే ఈ ఏడాది చివరి త్రైమాసికంలో వన్‌ప్లస్ 16 విడుదలయ్యే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

కంపెనీ నుంచి అధికారిక ప్రకటన రాకపోయినా, గత మోడల్‌ తరహాలోనే 2026 నాలుగో త్రైమాసికంలో వన్‌ప్లస్‌ 16 విడుదలయ్యే అవకాశముందని మార్కెట్‌ వర్గాలు అంచనా వేస్తున్నాయి.