హైలైట్స్:

  • AA బ్యాటరీలోనే నేరుగా టైప్‌సీ పోర్ట్‌
  • ప్రత్యేక ఛార్జింగ్‌ డాక్‌ అవసరం లేదు
  • 1.5V స్థిరమైన పవర్‌ అవుట్‌పుట్‌
  • 1000కిపైగా రీచార్జ్‌ సైకిళ్ల సపోర్ట్‌

హైదరాబాద్​ | మే 27, 2026:

USB-C Rechargeable Battery: ఇంట్లో రిమోట్‌ నుంచి డిజిటల్‌ కెమెరా వరకు.. గేమింగ్‌ కంట్రోలర్‌ నుంచి స్మార్ట్‌ లాక్‌ వరకు.. ఎన్నో చిన్న ఎలక్ట్రానిక్‌ పరికరాలు ఇప్పటికీ AA బ్యాటరీలపైనే ఆధారపడుతున్నాయి. బ్యాటరీ అయిపోతే కొత్త సెల్స్‌ కొనడం చాలా మందికి అలవాటే. కానీ ఇప్పుడు అదే చిన్న AA బ్యాటరీలోనే ఒక ఆశ్చర్యకరమైన సాంకేతికత వచ్చింది.

టొరెటో సంస్థ పల్స్​ ఏఏ యూఎస్​బీ టైప్​–సి రీచార్జబుల్​ లిథియం–అయాన్​ బ్యాటరీ(Pulse AA USB Type-C rechargeable Li-ion batteries)ను అందుబాటులోకి తీసుకొచ్చింది. బయటకు చూస్తే ఇవి సాధారణ AA బ్యాటరీల్లానే కనిపిస్తాయి. కానీ వీటిలోనే ఒక పక్క USB Type-C ఛార్జింగ్‌ పోర్ట్‌ ఉండటం ప్రత్యేక ఆకర్షణగా మారింది. ప్రత్యేక ఛార్జింగ్‌ డాక్‌ లేదా విడిగా బ్యాటరీ ఛార్జర్‌ అవసరం లేకుండా, 5V యూఎస్​బీ టైప్​–సి ఛార్జర్‌తో వీటిని నేరుగా ఛార్జ్‌ చేసుకోవచ్చు.

ఒక ప్యాక్‌లో రెండు AA బ్యాటరీలు లభిస్తాయి. ఫోన్‌, ఇయర్‌బడ్‌, పవర్‌బ్యాంక్‌లకు వాడే టైప్‌సీ కేబుల్‌తోనే ఈ బ్యాటరీలను ఛార్జ్‌ చేయొచ్చు. ఇంట్లోనే కాకుండా ప్రయాణాల్లోనూ సులభంగా వాడుకునేలా వీటిని రూపొందించినట్లు కంపెనీ చెబుతోంది.

చిన్న సెల్‌లోనే టైప్‌–సీ చార్జింగ్​ పోర్ట్​

సాధారణంగా రీచార్జబుల్‌ AA బ్యాటరీలు అంటే ప్రత్యేక ఛార్జర్‌ అవసరమనే భావన ఉంటుంది. కానీ Toreto Pulse బ్యాటరీల్లో ఇంటిగ్రేటెడ్‌ USB Type-C పోర్ట్‌ ఉండటం వల్ల ఆ అవసరం తగ్గుతుంది. నేరుగా బ్యాటరీకే కేబుల్‌ కనెక్ట్‌ చేసి ఛార్జింగ్‌ చేసుకోవచ్చు. చిన్న బ్యాటరీలో ఇలాంటి సౌకర్యం రావడం వల్ల ఇది గ్యాడ్జెట్‌ యూజర్లు ఎగిరి గంతేసే అప్‌గ్రేడ్‌లా కనిపిస్తోంది.

ఈ బ్యాటరీలు 1.5V అవుట్‌పుట్‌ అందిస్తాయని కంపెనీ పేర్కొంటోంది. సాధారణ రీచార్జబుల్‌ బ్యాటరీల్లో వాడుతున్న కొద్దీ వోల్టేజ్‌ తగ్గే పరిస్థితి కనిపిస్తుంది. అయితే Pulse బ్యాటరీలు పూర్తిగా డిశ్చార్జ్‌ అయ్యే వరకు స్థిరమైన పవర్‌ సరఫరా చేసేలా రూపొందించినట్లు కంపెనీ చెబుతోంది. దీని వల్ల రిమోట్‌ కంట్రోల్స్‌, డిజిటల్‌ కెమెరాలు, గేమింగ్‌ కంట్రోలర్లు, స్మార్ట్‌ లాక్స్‌, వైద్య పరికరాలు వంటి సున్నితమైన ఎలక్ట్రానిక్‌ పరికరాల్లో ఇవి ఉపయోగపడే అవకాశం ఉంది.

అలాగే ఈ బ్యాటరీల్లో 4255mWh సామర్థ్యం కలిగిన లిథియం-అయాన్‌ సెల్స్‌ ఉన్నాయి. గరిష్ఠంగా 2.5A హై డిశ్చార్జ్‌ కరెంట్‌కు సపోర్ట్‌ చేస్తాయి. అందువల్ల ఫ్లాష్‌ కెమెరాలు, ట్రిమ్మర్లు, మైక్రోఫోన్లు, బ్లూటూత్‌ కీబోర్డులు, రేజర్లు, ఇతర బ్లూటూత్‌ పరికరాల వంటి ఎక్కువ పవర్‌ అవసరమయ్యే గ్యాడ్జెట్లలో కూడా ఇవి సమర్థంగా పనిచేస్తాయని కంపెనీ వివరించింది.

Toreto Pulse rechargeable AA batteries for camera, trimmer, torch and gaming devices

కెమెరా, ట్రిమ్మర్‌, టార్చ్‌, గేమింగ్‌ పరికరాలకు Toreto Pulse AA రీచార్జబుల్‌ బ్యాటరీలు

Toreto Pulse AA rechargeable battery with USB Type-C charging port

AA బ్యాటరీలోనే టైప్‌సీ చార్జింగ్‌ పోర్ట్‌తో వచ్చిన Toreto Pulse రీచార్జబుల్‌ సెల్స్‌

1000కి పైగా రీచార్జ్‌ సైకిళ్లు

Toreto Pulse బ్యాటరీలను 1000 సార్లకు పైగా రీచార్జ్‌ చేసుకోవచ్చని కంపెనీ చెబుతోంది. దీంతో పదే పదే కొత్తగా వాడి పారేసే బ్యాటరీలు కొనాల్సిన అవసరం తగ్గుతుంది. దీర్ఘకాలంలో ఖర్చు ఆదా కావడంతో పాటు, వాడేసి పారేసే బ్యాటరీల సంఖ్య తగ్గడం వల్ల పర్యావరణానికి కూడా మేలు జరుగుతుంది.

భద్రత విషయంలోనూ ఈ బ్యాటరీలకు anti-leak seal, బలమైన రక్షణ కోటింగ్‌ ఇచ్చినట్లు కంపెనీ తెలిపింది. బ్యాటరీ లీకేజ్‌ ప్రమాదాన్ని తగ్గించేలా డిజైన్‌ చేసినట్లు చెబుతోంది. అదనంగా, -20 డిగ్రీల సెల్సియస్‌ నుంచి 60 డిగ్రీల సెల్సియస్‌ వరకు ఉష్ణోగ్రతల్లో కూడా పనిచేసేలా వీటిని రూపొందించినట్లు సమాచారం. భారతదేశంలోని వేర్వేరు వాతావరణ పరిస్థితులను దృష్టిలో పెట్టుకుంటే, ఇది ఉపయోగకరమైన అంశంగా చెప్పొచ్చు.

మరిన్ని చదవండి :

ఈ ఉత్పత్తిపై 6 నెలల వారంటీ కూడా లభిస్తుంది. మొత్తంగా చూస్తే, Toreto Pulse AA rechargeable batteries కేవలం సాధారణ బ్యాటరీల అప్‌గ్రేడ్‌ మాత్రమే కాదు.. చిన్న AA సెల్‌లో దాగిన టైప్‌సీ సర్‌ప్రైజ్‌ టెక్నాలజీ. ఇంట్లో బ్యాటరీలతో పనిచేసే పరికరాలు ఎక్కువగా ఉంటే, ఇలాంటి రీచార్జబుల్‌ సెల్స్‌ మంచి ప్రత్యామ్నాయం.