తగ్గిన బంగారం, వెండి ధరలు

బుధవారం బంగారం, వెండి ధరలు తగ్గుదలను నమోదు చేశాయి. బులియన్ మార్కెట్ లో 24క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర రూ. 600తగ్గి రూ.1,58,290వద్ద కొనసాగుతుంది. 22క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర రూ.550 తగ్గి రూ. 1,45,100 వద్ద నిలిచింది. కిలో వెండి ధర సైతం రూ.5,000 తగ్గి రూ. 2,90,000వద్ద కొనసాగుతుంది.

Reported by: Y.V. Narsimha Reddy | Latest News | May 27, 2026, 2:48 pm IST
Read Time: 3 mins
తగ్గిన బంగారం, వెండి ధరలు

ఇరాన్-అమెరికా మధ్య యుద్ధం ఇప్పట్లో ముగిసే ఛాయలు కనపడటం లేదు. దీని ప్రభావం బంగారం ధరలు మీద పడుతోంది. బులియన్ మార్కెట్ తీవ్ర ఒడిదుడుకులకు లోనవుతోంది. అంతర్జాతీయంగా నెలకొన్న ఆందోళనకర పరిస్థితులతో స్టాక్ మార్కెట్ సైతం కుదేలయిపోతోంది. పసిడి ధరలతో పాటు వెండి ధరలు కూడా తీవ్ర మార్పులకు లోనవుతున్నాయి.

బుధవారం బంగారం, వెండి ధరలు తగ్గుదలను నమోదు చేశాయి. బులియన్ మార్కెట్ లో 24క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర రూ. 600తగ్గి రూ.1,58,290వద్ద కొనసాగుతుంది. 22క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర రూ.550 తగ్గి రూ. 1,45,100 వద్ద నిలిచింది. కిలో వెండి ధర సైతం రూ.5,000 తగ్గి రూ. 2,90,000వద్ద కొనసాగుతుంది.

హెచ్చు తగ్గుల అంచనాల మధ్య ఊగిసలాట

అమెరికా-ఇజ్రాయెల్-ఇరాన్ వివాదం మొదలైనప్పటి నుంచి కామెక్స్‌లో బంగారం 15% తగ్గగా, స్పాట్ సిల్వర్ 20% పడిపోయింది. అయితే భారతదేశంలో బంగారం ధరలు భవిష్యత్తులో మరింత పెరిగే అవకాశం ఉందని ఐసీఐసీఐ బ్యాంక్ గ్లోబల్ మార్కెట్స్ నివేదిక స్పష్టం చేస్తోంది. అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధరలు నిరంతరం పెరగడం, అదే సమయంలో అమెరికా డాలర్‌తో పోలిస్తే భారత రూపాయి విలువ స్థిరంగా క్షీణిస్తూ ఉండటం వల్ల దేశీయంగా ఈ ధరల మార్పులు చోటుచేసుకుంటున్నాయి. ఐసీఐసీఐ బ్యాంక్ విశ్లేషణ ప్రకారం, 2026వ సంవత్సరం మిగిలిన కాలంలో భారత దేశీయ మార్కెట్లో బంగారం ధరలు తులానికి రూ. 1,50,000 నుండి రూ. 1,80,000 మధ్య ట్రేడ్ అయ్యే అవకాశం ఉందని అంచనా వేసింది.