Bajaj Pulsar Bike | అదే క్లాసిక్ డిజైన్.. కానీ అధునాతన ఫీచర్లు.. మార్కెట్‌లోకి బజాజ్ పల్సర్ 180 రీఎంట్రీ!

Bajaj Pulsar | ప్రముఖ ద్విచక్రవాహన తయారీ సంస్థ బజాజ్ ఆటో తన పలర్స్ 180 మోటార్ సైకిల్‌ను మళ్లీ భారత మార్కెట్‌లోకి తీసుకొచ్చింది. రూ.1.22లక్షల (ఎక్స్‌ షోరూం) ధరకే విడుదల చేసింది.

Bajaj Pulsar Bike | పల్సర్ బైక్ అంటే చాలామందికి ఒక ఎమోషన్.! ప్రముఖ ద్విచక్ర వాహన తయారీ సంస్థ బజాజ్ ఆటో క్లాసిక్ మోడల్ అయిన పల్సర్‌ను యూత్ నుంచి పెద్దవారి దాకా అందరీకి ఇదే ఫేవరేట్ అని చెప్పొచ్చు. బ్యాచిలర్స్‌కు అయినా ఫ్యామిలీకి అయినా సెట్ అయ్యేలా డిజైన్ ఉండటంతో అందర్నీ ఆకట్టుకుంటుంది. ఈ క్రమంలోనే దీని క్రేజ్‌ను దృష్టిలో పెట్టుకుని బజాజ్ కంపెనీ 180 సీసీ క్లాసిక్ మోడల్‌ను మళ్లీ తీసుకొచ్చింది. Bajaj Pulsar 180 బైక్‌ను 2026 వెర్షన్‌గా విడుదల చేసింది.

పల్సర్ 150 సీసీతో కలిసి పల్సర్ 180 బైక్‌లను 2001లో బజాజ్ ఆటో కంపెనీ లాంచ్ చేసింది. పర్ఫార్మెన్స్ కమ్యూటర్ సెగ్మెంట్‌కు పునాది వేసిన బైక్‌ల్లో ఒకటిగా గుర్తింపు పొందింది. కానీ ఈ మోడల్‌ను 2022లో బజాజ్ కంపెనీ నిలిపివేసింది. కానీ అభిమానుల నుంచి కొనసాగుతున్న డిమాండ్ నేపథ్యంలో ఇప్పుడు మళ్లీ మార్కెట్‌లోకి తీసుకొచ్చేందుకు నిర్ణయించింది. కాగా, పల్సర్ 180 బైక్‌కు ఇది మూడోసారి రీఎంట్రీ కావడం విశేషం. గతంలో 2019లోనూ ఈ మోడల్‌ను కొద్దిరోజులు నిలిపివేసింది. బజాజ్ ఆటో 25వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని పల్సర్ 180ని మార్కెట్‌లోకి మళ్లీ తీసుకొచ్చింది. అయితే ఇప్పటి అభిరుచులకు తగినట్లు ఆధునిక ఫీచర్లను జోడించింది.

ఇంజిన్ విషయానికి వస్తే.. ఈ బైక్‌లో 178.61సీసీ DTS I, సింగిల్ సిలిండర్, ఎయిర్‌కూల్డ్ ఇంజిన్‌ను అమర్చారు. ఇది గరిష్ఠంగా 17PS పవర్, 15nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. గత మోడల్‌లో పోలిస్తే టార్క్‌లో స్వల్ప పెరుగుదల కనిపిస్తుంది. ఇక ఇది 5 స్పీడ్ గేర్‌బాక్స్‌తో వస్తుంది.

డిజైన్‌పరంగా పల్సర్‌ బైక్‌కు సొంతమైన నేక్‌డ్ స్ట్రీట్ ఫైటర్ లుక్‌నే కొనసాగిస్తూ కొత్త గ్రాఫిక్స్‌తో మరింత ఆకర్షణీయంగా మార్చాడు. ఫుల్ LED హెడ్‌ల్యాంప్, LED ఇండికేటర్లు ఉన్నాయి. బ్లూటూత్ కనెక్టివిటీతో కూడిన డిజిజల్ కన్‌సోల్ కూడా అమర్చారు. USB చార్జింగ్ పోర్టు వంటి అధునిక ఫీచర్లను అందించారు.

ఇక ఈ పల్సర్ బైక్ ఐదు రంగుల్లో లభించనుంది. బ్లాక్ గోల్డ్, బ్లాక్ బ్లూ, బ్లాక్ గ్రే, బ్లాక్ రెడ్, వైట్ వంటి ఐదు కలర్ ఆప్షన్లు వస్తున్నాయి. సేఫ్టీ విషయానికి వస్తే ముందుభాగంలో 280mm, వెనుక భాగంలో 230mm బ్రేకులు ఇచ్చారు. ABS సిస్టమ్‌తో రైడింగ్ భద్రతను పెంచారు. అలాగే 17 అంగుళాల వీల్స్, ట్యూబ్‌లెస్ టైర్లు అందించారు. ముందు టెలిస్కోపిక్ ఫోర్క్స్, వెనుక ట్విన్ షాక్ అబ్జార్బర్స్‌తో సస్పెన్షన్ సెటప్‌ను అందించారు. 165mm గ్రౌండ్ క్లియరెన్స్‌, 1340mm వీల్‌బేస్‌తో రోడ్ స్టెబిలిటీ మెరుగ్గా ఉంటుంది. ఈ బైక్ బరువు 156 కిలోలు కాగా.. 15 లీటర్ల పెట్రోల్ ట్యాంక్ కలిగి ఉంది.

ఈ బైక్ ప్రస్తుతం మార్కెట్‌లో ఉన్న TVS Apache RTR 180, Honda Hornet 2.0 బైక్‌లకు గట్టి పోటీనిస్తుందని ఆటోమొబైల్ రంగ నిపుణులు భావిస్తున్నారు. అపాచీ ఆర్‌టీఆర్ 180 ధర రూ.1.25 లక్షలు, హోర్నెట్ 2.0 ధర రూ.1.47లక్షలు (ఎక్స్ షోరూం)తో ప్రారంభవుతున్నాయి. కానీ వీటితో పోలిస్తే పల్సర్ 180 బైక్ ధర తక్కువగా ఉంది. దీని ధరను రూ.1,22,490గా (ఎక్స్ షోరూ)గా బజాజ్ ఆటో కంపెనీ నిర్ణయించింది.

మొత్తంగా తన ప్రత్యేకమైన స్టైలింగ్‌ను కాపాడుకుంటూనే.. ఆధునీకరించి తీసుకొస్తున్న ఈ మోడల్.. మార్కెట్‌లో గట్టి పోటీగా మారనుందని ఆటో మొబైల్ రంగ నిపుణులు అంచనా వేస్తున్నారు.

Read More:

BMW F 450 GS | బీఎండబ్ల్యూ నుంచి కొత్ బైక్ వచ్చేస్తోంది.. ఫీచర్లు చూస్తే షాక్ అవ్వాల్సిందే!

Rajasekhar | చిన్న‌ప్ప‌టి నుండి బైక్స్ అంటే చాలా ఇష్టం.. భ‌యంతో నా బైక్‌ని జీవిత అమ్మేసింది: రాజ‌శేఖ‌ర్

Latest News