Ileana | టాలీవుడ్‌లో ఒకప్పుడు స్టార్ హీరోయిన్‌గా వెలిగిన ఇలియానా డిక్రూజ్ తన అందం, నటనతో ప్రేక్షకులను ఆకట్టుకుంటూ వరుస హిట్ సినిమాలు చేస్తూ వెళ్లింది. ముఖ్యంగా మహేష్ బాబుతో కలిసి చేసిన పోకిరి చిత్రం ఆమె కెరీర్‌కు టర్నింగ్ పాయింట్‌గా నిలిచింది. ఆ సినిమా తర్వాత ఇలియానాకు విపరీతమైన ఫాలోయింగ్ ఏర్పడింది.
తెలుగులో అల్లు అర్జున్, ప్రభాస్, ఎన్టీఆర్, పవన్ కళ్యాణ్, రవితేజ, రామ్ పోతినేని, తరుణ్ వంటి స్టార్ హీరోల సరసన నటించి టాప్ హీరోయిన్‌గా ఎదిగింది.అయితే, కెరీర్ పీక్‌లో ఉన్న సమయంలోనే ఇలియానా ఇండస్ట్రీ నుంచి కొంతకాలం బ్యాన్‌ను ఎదుర్కొనడం సంచలనంగా మారింది. ఈ విషయాన్ని నిర్మాతల మండలి మాజీ అధ్యక్షుడు ఒక ఇంటర్వ్యూలో వెల్లడించారు.
అడ్వాన్స్ తీసుకొని షూటింగ్‌కి డుమ్మా..
వివరాల్లోకి వెళ్తే, ఒక తమిళ నిర్మాతతో ఇలియానాకు జరిగిన వివాదమే ఈ బ్యాన్‌కు కారణమని తెలుస్తోంది. సినిమా చేస్తానని చెప్పి దాదాపు రూ.40 లక్షల అడ్వాన్స్ తీసుకున్న ఆమె, తర్వాత షూటింగ్‌కు హాజరుకాలేదని ఆరోపణలు వచ్చాయి. డేట్స్ ఇచ్చానని ఇలియానా వాదించినప్పటికీ, ఆ డేట్స్‌లో ఒక్క రోజైనా షూటింగ్‌కు రాలేదని నిర్మాతలు చెబుతున్నారు.
ఈ విషయంపై నిర్మాతలు చాంబర్‌లో ఫిర్యాదు చేయడంతో, ఇలియానాను పిలిపించి వివరణ కోరారు. అయితే డబ్బులు తిరిగి ఇవ్వడానికి ఆమె నిరాకరించడంతో, నిర్మాతల మండలి ఆమెపై బ్యాన్ విధించినట్లు సమాచారం.
ఇంకా, బ్యాన్ అమల్లో ఉన్న సమయంలో కూడా ఒక కొత్త సినిమా చేయడానికి ఆమె ప్రయత్నించగా, ఆ నిర్మాతను సంప్రదించి రూ.40 లక్షలు చెల్లించకుండా ఆమెను తీసుకోరాదని హెచ్చరించినట్లు తెలుస్తోంది.
రీ ఎంట్రీ ఇచ్చినా..
ఈ వివాదం కారణంగా ఇలియానా కెరీర్‌కు పెద్ద దెబ్బ తగిలింది. అప్పట్లో మంచి ఫామ్‌లో ఉన్నప్పటికీ, అవకాశాలు కోల్పోయి క్రమంగా ఇండస్ట్రీకి దూరమయ్యింది. తర్వాత తిరిగి సినిమాల్లోకి వచ్చినా, మునుపటి స్థాయి విజయాలు సాధించలేకపోయింది.
ఇక వ్యక్తిగత జీవితంలో ఇలియానా కొత్త దశలోకి అడుగుపెట్టింది. విదేశీయుడితో ప్రేమలో పడి, తర్వాత కుటుంబ జీవితం వైపు మళ్లింది. ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉండి వ్యక్తిగత జీవితాన్ని ఆస్వాదిస్తోంది. ఒక చిన్న వివాదం ఎంత పెద్ద స్టార్ కెరీర్‌పై ప్రభావం చూపుతుందో ఇలియానా ఉదాహరణగా నిలిచిందని సినీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.
