Ileana | ఇలియానా తల్లి కావడానికి కారణం అతనేనా.. రివీలైనట్లేనా?
Ileana | ‘పోకిరి, కిక్, జల్సా.. ఇలా తన జాబితాలో ఇంకా ఎన్నో సినిమాలు, ఓ ట్రెండ్‌కు ఆమె సాక్షి. తన సన్నని నడుముతో యూత్ మతులు పోగొట్టిన వయ్యారి భామ. సడెన్‌గా తల్లిని కాబోతున్నానంటూ ఫోటో సోషల్ మీడియాలో పోస్ట్ చేసే సరికి ఆమె ఫ్యాన్స్ మతులు పోయినట్లయింది. ఇలియానా గత కొంత కాలంగా ఎవరితోనో డేటింగ్‌లో ఉందంటూ వస్తున్న వార్తల్ని పక్కకి తోసేసి, తను తల్లిని కాబోతున్నానంటూ చెప్పేసరికి అది ఎవరై ఉంటారా? అని […]

Ileana |
‘పోకిరి, కిక్, జల్సా.. ఇలా తన జాబితాలో ఇంకా ఎన్నో సినిమాలు, ఓ ట్రెండ్‌కు ఆమె సాక్షి. తన సన్నని నడుముతో యూత్ మతులు పోగొట్టిన వయ్యారి భామ. సడెన్‌గా తల్లిని కాబోతున్నానంటూ ఫోటో సోషల్ మీడియాలో పోస్ట్ చేసే సరికి ఆమె ఫ్యాన్స్ మతులు పోయినట్లయింది. ఇలియానా గత కొంత కాలంగా ఎవరితోనో డేటింగ్‌లో ఉందంటూ వస్తున్న వార్తల్ని పక్కకి తోసేసి, తను తల్లిని కాబోతున్నానంటూ చెప్పేసరికి అది ఎవరై ఉంటారా? అని సోషల్ మీడియా అంతా రచ్చయింది.
ఇంట్లో కుక్కతో ఆడుకుంటున్న ప్రియుడి ఫోటో ముఖం కనిపించకుండా పెట్టి మరింత రెచ్చగొట్టింది. కాసేపు బాలీవుడ్ హీరోయిన్ కత్రినా కైఫ్ తమ్ముడు సెబాస్టియన్‌తో ప్రేమలో ఉందనే వార్తలు కూడా వినిపించాయి. కాకపోతే ఇలియానా ఇలా తల్లిని కాబోతున్నాననే వార్తను మాత్రమే చెప్పి తన ప్రియుడి విషయం ఎందుకు దాస్తుందో ఎవరికీ అర్థం కాలేదు.
తాజాగా తను పండంటి బిడ్డకు జన్మనిచ్చానని బాబు పేరు ‘కోవా ఫీనిక్స్ డోలన్’ అని చెప్పేసరికి అంతా కంగ్రాట్స్ చెప్పారు. అబ్బాయి చాలా అందంగా ఉన్నాడని కామెంట్స్ చేశారు. ఇంతకీ ఇప్పటికైనా అతగాడి గురించి చెబుతుందా అనేది ఇంకా ప్రశ్నగానే ఉంది.
సినిమా వాళ్ళు ప్రేమించుకోవడం, బ్రేకప్స్ చెప్పుకోవడం, పెళ్ళి చేసుకోవడం, కొద్ది రోజుల్లోనే విడాకులు తీసుకోవడం వంటి విషయాలు కామన్‌గా జరిగేవే అయినా.. ఇలియానా విషయంలో కాస్త ఎక్కువగా ఆమె విషయం ప్రసారం అవుతూ వచ్చింది. అయితే ఇలియానా సోషల్ మీడియాలో తన సైడ్ నుంచి ఏం చెప్పాలను కుంటుంది అనేది సరిగ్గా తెలియకపోయినా ఆమె కోరుకున్న లైఫ్‌లో సంతోషంగా ఉన్నాననే సంగతి చెప్పకనే చెప్పింది.
అయితే మనవాళ్ళు ఏమైనా తక్కువ తిన్నారా? వాళ్ళ అన్వేషణలో వాళ్ళున్నారు. మొత్తానికి కూపీ లాగారు. ఇలియానా ప్రియుడి పేరు మైఖేల్ డోలన్ అట. ఇతగాడు విదేశాలకు చెందినవాడని పేరును బట్టి తెలుస్తుంది. అయితే కొన్నాళ్ళుగా ఇద్దరూ సహజీవనం చేస్తున్నారు.
ఇద్దరూ మే నెలలోనే పెళ్ళి చేసుకున్నారట. ఈ సంగతి ఇలియానా ఎందుకు బయటకు చెప్పలేదు. అసలు అతగాడు ఏం చేస్తాడనే వివరాలేమీ తెలియలేదు. ఏది ఏమైనా ఇలియానా చక్కగా పెళ్ళి చేసుకుని, ఓ బిడ్డకు తల్లి అయిందనే వార్త, ఆమెను అభిమానించే అందరిలోనూ సంతోషాన్ని నింపింది. మరి ఈ మైఖేల్ డోలన్ వ్యవహారం ఇలియానా ఎప్పటికి బయటపెడుతుందో చూద్దాం..