Ileana: నిండు గ‌ర్భంతో ద‌ర్శ‌న‌మిచ్చిన ఇలియానా.. డెలివ‌రీ డేట్ ఎప్పుడంటే..!

Ileana:  గోవా బ్యూటీ ఇలియానా త‌న ప్రగ్నెన్సీతో కొద్ది రోజులుగా వార్త‌ల‌లో నిలుస్తుంది. ఈ అమ్మ‌డు పెళ్లి కాకుండానే ప్ర‌గ్నెంట్ కావ‌డంతో అంద‌రు షాక్ అయ్యారు. ఇక త‌న‌ని ప్ర‌గ్నెంట్ చేసిన వ్య‌క్తి ఎవ‌ర‌నే సందేహం అంద‌రిలో ఉండ‌గా, ఆయ‌న ఫేస్ క‌నిపించ‌కుండా ఫొటోలు షేర్ చేస్తూ స‌స్పెన్స్ లో పెడుతూ వ‌చ్చింది. ఇటీవ‌ల అత‌నితో క్లోజ్‌గా దిగిన పిక్స్ షేర్ చేసింది. కాని అత‌ను డీటైల్స్ ఏమి చెప్ప‌లేదు. ఇక త‌ను ప్ర‌గ్నెంట్ అయిన‌ప్ప‌టి నుండి సోష‌ల్ […]

  • By: sn    latest    Jul 27, 2023 6:25 AM IST
Ileana: నిండు గ‌ర్భంతో ద‌ర్శ‌న‌మిచ్చిన ఇలియానా.. డెలివ‌రీ డేట్ ఎప్పుడంటే..!

Ileana: గోవా బ్యూటీ ఇలియానా త‌న ప్రగ్నెన్సీతో కొద్ది రోజులుగా వార్త‌ల‌లో నిలుస్తుంది. ఈ అమ్మ‌డు పెళ్లి కాకుండానే ప్ర‌గ్నెంట్ కావ‌డంతో అంద‌రు షాక్ అయ్యారు. ఇక త‌న‌ని ప్ర‌గ్నెంట్ చేసిన వ్య‌క్తి ఎవ‌ర‌నే సందేహం అంద‌రిలో ఉండ‌గా, ఆయ‌న ఫేస్ క‌నిపించ‌కుండా ఫొటోలు షేర్ చేస్తూ స‌స్పెన్స్ లో పెడుతూ వ‌చ్చింది. ఇటీవ‌ల అత‌నితో క్లోజ్‌గా దిగిన పిక్స్ షేర్ చేసింది. కాని అత‌ను డీటైల్స్ ఏమి చెప్ప‌లేదు. ఇక త‌ను ప్ర‌గ్నెంట్ అయిన‌ప్ప‌టి నుండి సోష‌ల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటూ వ‌స్తున్న ఇలియానా బేబి బంప్ పిక్స్ తో ర‌చ్చ చేస్తుంది. తాజాగా ఇలియానా మిర్ర‌ర్ సెల్ఫీ ఒక‌టి షేర్ చేయ‌గా, ఆ ఫొటోలో ఇలియానా నిండు గర్భిణిగా కనిపిస్తుంది.

ప్రస్తుతం ఇలియానాకి 9వ నెల అని తెలుస్తుండ‌గా, వ‌చ్చే నెల‌లోనే ఆమె పండంటి బిడ్డ‌కు జ‌న్మ‌నివ్వ‌నుంద‌ని చెబుతున్నారు. ఇక ఇలియానా తాను షేర్ చేసిన పిక్స్ లో రెడ్‌ డ్రెస్‌ ధరించి నిండైన బేబి బంప్‌తో తన అందాల విందు కూడా చేసింది. ఈ పిక్స్ లో ఇల్లీ బేబి చాలా హాట్‌గా కనిపిస్తుంది. ఇక ఇలియానాత‌న పోస్ట్‌కి ..’మై లిటిల్‌’ అని ఫ్రూట్‌ ఎమోజీని పంచుకోవ‌డం విశేషం.. మ‌రి కొద్ది రోజుల‌లో ఇలియానా తన చిట్టి బేబీని అందరికి పరిచయం చేయనుంది. మ‌రి ఆ బేబీతో పాటే తన రిలేషన్‌షిప్ పార్ట్నర్ ని కూడా అఫీషియల్ గా పరిచయం చేస్తుందా అని అంద‌రు ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు. ఇక ఇలియానాకి ఆ అమ్మ‌డి ఫ్యాన్స్ జాగ్ర‌త్త‌లు చెబుతున్నారు.

గోవా బ్యూటీగా తెలుగు ప్రేక్ష‌కుల‌ని ప‌ల‌క‌రించిన ఇలియానా ఒక‌ప్పుడు టాలీవుడ్‌ని ఓ ఊపు ఊపిన విషయం తెలిసిందే. స్టార్ హీరోలందరితోనూ కలిసి తెగ సంద‌డి చేసింది. ముఖ్యంగా ఈ అమ్మ‌డు త‌న సన్నని నడుముతో టాలీవుడ్‌ని ఊపేసింది. కోట్లాది మంది అభిమానుల మ‌న‌సులు కొల్ల‌గొట్టింది.ఈ బ్యూటీ కేవలం గ్లామర్‌ పాత్రలనే కాకుండా ఎంతో కొంత నటనకు స్కోప్‌ ఉన్న పాత్రలలో న‌టించి అల‌రించింది. బాలీవుడ్ కి వెళ్లాక ఇలియానా కెరీర్ దెబ్బ‌తింది. కొన్నాళ్లు సినిమాల‌కి బ్రేక్ ఇచ్చి ఆ త‌ర్వాత రీ ఎంట్రీ ఇచ్చిన కూడా ఇలియానాకి పెద్ద‌గా క‌లిసిరాలేదు. ఈ క్ర‌మంలో ఆమె పిల్లా పాప‌ల‌తో సంతోషంగా ఉండాల‌ని డిసైడ్ అయిన‌ట్టుంది.