BMW F 450 GS | జర్మనీకి చెందిన ప్రముఖ ద్విచక్ర వాహన తయారీ సంస్థ BMW Motorrad తన అడ్వెంచర్ బైక్ పోర్ట్‌ఫోలియోను విస్తరించడంపై టార్గెట్ చేసింది. ఈ క్రమంలోనే తన సరికొత్త మోడల్ BMW F 450 GS మోడల్‌ను భారత్‌లో విడుదల చేస్తుంది. ఈ నెల 23వ తేదీన ఈ బైక్‌ను అధికారికంగా విడుదల చేస్తు్న్నట్లు బీఎండబ్ల్యూ కంపెనీ ప్రకటించింది. మిడిల్ రేంజ్ కెపాసిటీతో రూపొందించిన ఈ బైక్‌ను పెద్ద జీఎస్ మోడళ్లతో పోలిస్తే సులభంగా హ్యాండిల్ చేయగలిగేలా రూపొందించినట్లు పేర్కొంది.
ఈ కొత్త బైక్‌లో 420cc సామర్థ్యం గల ప్యారలల్ ట్విన్ ఇంజిన్‌ను అమర్చారు. 135 డిగ్రీల క్రాంక్ సెటప్‌తో రూపొందించిన ఈ ఇంజిన్ 48bhp శక్తిని, 43nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఆరు స్పీడ్ గేర్ బాక్స్‌తో పాటు స్లిప్పర్, అసిస్ట్ క్లచ్‌ను స్టాండర్డ్‌గా అందించారు. అదనంగా సెమీ ఆటోమేటిక్ క్లచ్ ఆప్షన్ కూడా ఇచ్చారు. ఇంజిన్ పనితీరును సాఫ్ట్‌గా ఉంచేందుకు బ్యాలెన్స్ షాఫ్ట్‌ను ఉపయోగించారు.
డిజైన్ పరంగా జీఎస్ సిరీస్‌కు ఉండే ప్రత్యేక శైలిని ఈ బైక్‌లోనూ కొనసాగించారు. బీక్ స్టైల్ ఫ్రంట్, X షేప్ LED హెడ్‌లైట్, టాల్ స్టాన్స్ వంటి అంశాలు దీనికి ఆకర్షణీయమైన లుక్‌ను అందిస్తున్నారు. సుమారు 178 కిలోల బరువుతో ఉండే ఈ బైక్.. అడ్వెంచర్ రైడింగ్‌ను అందిస్తాయి.
ఈ బైక్ ముందు భాగంలో అప్‌సైడ్ డౌన్ ఫోర్స్ సస్పెన్షన్, వెనుకభాగంలో మోనో షాక్స్ సెటప్‌ను అందించారు. ఈ రెండూ 180nm ట్రావెల్‌ను అందిస్తాయి. బ్రేకింగ్ వ్యవస్థలో ముందు భాగంలో బ్రెంబో యూనిట్, వెనుక భాగంలో ByBre కంపోనెంట్లు ఉపయోగించారు. సాధారణ రహదారి ప్రయాణ సౌకర్యంతో పాటు తేలికపాటి ఆఫ్ రోడ్ వినియోగం మధ్య ఇవి సమతుల్యతను అందించనున్నాయి.
ఈ బైక్‌లో ఆధునిక ఎలక్ట్రానిక్స్ ఫీచర్లు కూడా బాగానే ఉన్నాయి. ట్రాక్షన్ కంట్రోల్, లీన్ సెన్సిటివ్ ABS, డైనమిక్ బైక్ కంట్రోల్, ఇంజిన్ బ్రేక్ మేనేజ్‌మెంట్ వంటి ఫీచర్లు ఇందులో ఉన్నాయి. ఇక రైడింగ్ మోడ్స్‌లో Rain, Road, Enduro స్టాండర్డ్‌గా ఉండగా.. Enduro Pro హై వేరియంట్‌లో లభిస్తుంది. అదనంగా Shift Assistant Pro కూడా ఉండే అవకాశం ఉంది.
టెక్నాలజీపరంగా ఈ బైక్‌లో 6.5 అంగుళాల TFT డిస్‌ప్లేను అమర్చారు. బ్లూటూత్ కనెక్టివిటీ, నావిగేషన్ సపోర్టు వంటి సౌకర్యాలు కూడా ఇందులో ఇచ్చారు. అలాగే USB C చార్జింగ్ పోర్టు, హీటెడ్ గ్రిప్ వంటి ఫీచర్లు ఉన్నాయి.
ధర ఎంత ఉండొచ్చు?
అంతర్జాతీయ మార్కెట్‌లో ఈ బైక్ బేసిక్, ఎక్స్‌క్లూజివ్, స్పోర్ట్, జీఎస్ ట్రోఫీ అనే నాలుగు వేరియంట్లలో అందుబాటులో ఉంది. భారత మార్కెట్‌లో కూడా వీటిలో కొన్నింటిని అందించే అవకాశం ఉంది. అయితే ఏ వేరియంట్లు అందుబాటులో ఉంటాయనే విషయాన్ని ఇంకా ధృవీకరించలేదు. కానీ ఇప్పటికే ఈ బైక్‌ల ఉత్పత్తిని హోసూర్ ప్లాంట్‌లో టీవీఎస్ మోటార్ కంపెనీ ప్రారంభించినట్లు సమాచారం. ఇక ఈ బైక్ ధరను కూడా అధికారికంగా ప్రకటించలేదు. కాకపోతే ఈ బైక్ ధర రూ.4లక్షల నుంచి రూ.4.50లక్షల వరకు ఉండొచ్చని అంచనా వేస్తున్నారు.
Read More:
టీజర్‌తోనే ఇంట్రెస్ట్ పెంచేసిన యెజ్డీ.. ఏప్రిల్ 23 సరికొత్త బైక్ లాంచ్!
ఇంజిన్ కెపాసిటీ తగ్గింది.. ధర మాత్రం పెద్దగా తగ్గలేదు.. నిరాశపరిచిన ట్రయంఫ్ నిర్ణయం!
