Yezdi | టీజర్‌తోనే ఇంట్రెస్ట్ పెంచేసిన యెజ్డీ.. ఏప్రిల్ 23 సరికొత్త బైక్ లాంచ్!

Yezdi | ప్రముఖ ద్విచక్ర వాహన సంస్థ యెజ్డీ మోటార్‌సైకిల్స్ భారత మార్కెట్‌లో మరో కొత్త మోడల్‌ను ప్రవేశపెట్టేందుకు సిద్ధమవుతోంది. ఏప్రిల్ 23వ తేదీన కొత్త బైక్‌ను విడుదల చేయనున్నట్లుగా ఒక ఆసక్తికరమైన టీచర్‌ను సోషల్‌మీడియాలో విడుదల చేసింది.

Yezdi | టీజర్‌తోనే ఇంట్రెస్ట్ పెంచేసిన యెజ్డీ.. ఏప్రిల్ 23 సరికొత్త బైక్ లాంచ్!

Yezdi | ప్రముఖ ద్విచక్ర వాహన సంస్థ యెజ్డీ మోటార్‌సైకిల్స్ భారత మార్కెట్‌లో మరో కొత్త మోడల్‌ను ప్రవేశపెట్టేందుకు సిద్ధమవుతోంది. ఏప్రిల్ 23వ తేదీన కొత్త బైక్‌ను విడుదల చేయనున్నట్లుగా ఒక ఆసక్తికరమైన టీచర్‌ను సోషల్‌మీడియాలో విడుదల చేసింది. కానీ బైక్‌కు సంబంధించిన వివరాలను మాత్రం వెల్లడించలేదు. అయితే ఇది Scrambler మోడల్ కావచ్చనే ప్రచారం జరుగుతోంది.

అయితే యెజ్డీ ప్రకటించిన ఏప్రిల్ 23వ తేదీన BSA మోటార్‌సైకిల్స్ బ్రాండ్‌కు చెందిన BSA Scrambler 650 కూడా భారత మార్కెట్‌లోకి లాంచ్ అవుతోంది. దీంతో కొత్తగా రాబోయే యెజ్డీ బైక్ కూడా స్క్రాంబ్లర్ మోడల్ అయ్యి ఉండొచ్చని ఊహాగానాలు వస్తున్నాయి. ముఖ్యంగా ఈ రెండు బైక్‌లు ఒకే ప్లాట్‌ఫామ్‌ను పంచుకునే అవకాశం ఉందనే చర్చ కూడా నడుస్తోంది.

ఇక టీజర్‌లో “Well, at least it’s not 69days to go ” అనే క్యాప్షన్‌ను ఉపయోగించడం ఇప్పుడు మరో చర్చకు దారితీసింది. ఎందుకంటే ప్రస్తుతం భారత మార్కెట్‌లో యెజ్డీ బ్రాండ్ నుంచి రోడ్‌స్టర్, అడ్వెంచర్‌ బైక్‌ల విక్రయాలు జరుగుతున్నాయి. ఈ బైక్‌లకు 69 అనే సంఖ్యను యెజ్డీ ఉపయోగిస్తుంది. అయితే టీజర్‌లో ఇచ్చిన క్యాప్షన్ బట్టి చూస్తే కొత్తగా వచ్చే బైక్‌లో వేరే ఇంజిన్‌ను ఉపయోగించే అవకాశం ఉందని ఆటోమొబైల్ నిపుణులు భావిస్తున్నారు.

ఇప్పటివరకు యెజ్డీ లైనప్‌లో Scrambler, Roadster, Adventure మోడళ్లు ఉన్నాయి. వీటిలో రోడ్‌స్టర్, అడ్వెంచర్ మోడళ్లకు 2025లో కూడా అప్‌డేట్లు ఇచ్చింది. కానీ స్క్రాంబ్లర్ మాత్రం చాలాకాలంగా ఎలాంటి అప్‌డేట్ లేదు. ఇది 334CC సింగిల్ సిలిండర్ లిక్విడ్ కూల్డ్ ఇంజిన్‌తో వస్తుంది. ఈ ఇంజిన్ గరిష్టంగా 29హెచ్‌పీ పవర్, 29ఎన్‌ఎం టార్క్‌‌ను ఉత్పత్తి చేస్తుంది. దీని ధర కూడా సుమారు రూ.1.95లక్షల (ఎక్స్‌షోరూం) నుంచి ప్రారంభమవుతోంది.

ఒకవేళ కొత్తగా రాబోయే Yezdi Scramblerలో BSA స్క్రాంబ్లర్ 650 ప్లాట్‌ఫామ్‌ను షేర్ చేస్తే ఇందులో 652సీసీ సింగిల్ సిలిండర్ లిక్విడ్ కూల్డ్ ఇంజిన్ ఉండే అవకాశం ఉంది. ఈ ఇంజిన్ 4000rpm వద్ద 45hp పవర్, 55 nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. అలాగే ఈ మోడల్ 6 స్పీడ్ గేర్‌బాక్స్‌తో వచ్చే అవకాశం ఉందని సమాచారం.

ఈ కొత్త బైక్‌లో సరికొత్త LED హెడ్‌ల్యాంప్, టైల్ ల్యాంప్ ఉండే అవకాశం ఉంది. డిజైన్‌లో పెద్దగా మార్పు చేయకపోయినప్పటికీ.. లుక్ చేంజ్ కోసం ఇండికేటర్లలో మార్పులు చేయొచ్చని ఆటో మొబైల్ నిపుణులు చెబుతున్నారు. అలాగే మరిన్ని కొత్త కలర్ ఆప్షన్స్ కూడా అందుబాటులోకి వస్తాయని భావిస్తున్నారు. మొత్తంగా చూస్తే యెజ్డీ నుంచి రాబోయే బైక్‌పై ఆటోమొబైల్ రంగంలో భారీగా ఆసక్తి నెలకొంది.

Read More:

ఇంజిన్ కెపాసిటీ తగ్గింది.. ధర మాత్రం పెద్దగా తగ్గలేదు.. నిరాశపరిచిన ట్రయంఫ్ నిర్ణయం!

విండోలు తెరిచి కారు నడిపితే మైలేజ్ తగ్గుతుందా? నిజం ఏమిటి?