Magic Mirror
విధాత: సాంకేతికత తెచ్చిన మార్పులు ఒక్కోసారి వింతగా ఉంటుంటాయి. తెలుగులో ఆధిత్య 369సినిమాలో టైం మిషన్ ద్వారా..హీరో హీరోయిన్లు.. బింబిసార సినిమాలో హీరో రాజు బింబిసారుడు మాయ దర్పణంలోంచి గతం నుంచి వర్తమాన ఆధునిక కాలానికి మధ్య ప్రయాణించడం వంటి చిత్రాలు మనం చూశాం. అలాంటిదే ఓ మ్యాజిక్ మిర్రర్. నిజానికి దీనిని మ్యాజిక్ మిర్రర్ అనడం కంటే ఇంకేదైనా పేరు వెతుక్కొవాల్సిందే. ఓ పర్యాటక పార్కు ప్రాంతంలో ఓ గదికి ఏర్పాటు చేసిన వెడల్పాటి అద్దంతో అక్కడికి వచ్చిన వారంతా మోసపోతున్న వీడియో వైరల్ గా మారింది. భారీ అద్దంలో తమను తాము చూసుకుంటూ దగ్గరకు వెళ్లి వెనుకవైపు ఏమైనా కనిపిస్తుందా అని సందర్శకులు గమనిస్తుంటారు.
Wait for End Magic Mirror 😆 🤣 😂 pic.twitter.com/EdA1XSwF2w
— Nisha Malik (@NishaMa1ik) July 27, 2025
అయితే వారికి లోపలి వైపు నుంచి ఏమున్నదన్న అంశం కనిపించదు. కాని లోపలి వైపు నిర్మాణం టాయిలెట్లు కావడం గమనార్హం. టాయిలెట్లు వినియోగించే వారు అద్దం ఆవలివైపున ఉన్న వారిని చూస్తూ తమపని కానిచ్చేస్తుంటారు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ గా మారింది. చూడటానికి ఈ మ్యాజిక్ అద్దం మహాభారతంలోని మయసభ తీరులో అవతలి వైపు వారికి బాగానే ఉన్నా…జనాన్ని చూస్తూ అద్దం ఇవతలి వైపున టాయిలెట్స్ ఉపయోగించడం మాత్రం ఎబ్బెట్టుగా ఉందని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.