విధాత : అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో వస్తున్న పుష్ప అభిమానుల్లో రోజురోజుకి అంచనాలను రెట్టింపు చేస్తుంది. ఇప్పటికే పాటలు విశేష ప్రాచుర్యం పొంది ట్రెండింగ్ లో ఉండగా ఇప్పుడు సునీల్ జన్మదినం సందర్భంగా విడుదల చేసిన ఫస్ట్ లుక్ సినిమా పై అంచనాలను అమాంతం పెంచుతున్నాయి..
ఇప్పటి వరకు కమెడియన్ గా, క్యారెక్టర్ యాక్టర్ గా, హీరోగా నటించి మెప్పించిన సునీల్ పుష్ప సినిమాతో మరోమారు విలన్ (మంగళం శీను) గా మన ముందుకు రానున్నాడు. ఈ సినిమాలో ఎవరూ ఊహించని విధంగా సునీల్ క్యారెక్టర్ ఉండనున్నట్లు ఫస్ట్ లుక్ ద్వారా ఇట్టే తెలుస్తోంది.