Syringe Prank వీడియోలతో కలకలం.. కట్ చేస్తే ఆరు నెలల జైలు!

సరదాగా నవ్విద్దామని వీడియోలు చేశాడు. కానీ.. అందుకోసం ఆయన చేసిన ప్రయత్నం నవ్వు తెప్పించే బదులు.. తీవ్ర భయాందోళనలు రేపింది. దీంతో బాధితులు కేసు పెట్టారు. ప్రాంక్‌ వీడియోలు చేసిన వ్యక్తికి కోర్టు ఆరు నెలలు జైలు శిక్ష విధించింది.

Syringe Prank | ప్రాంక్‌ వీడియోలు చేయడం చాలా కాలం నుంచే ఉన్నది. సడన్‌గా ఎదురుపడి భయపెట్టడం లేదా ఇతర పనులతో నవ్వించడం, ఏడిపించడం, వేధించడం వంటి పనులు చేసి, వారి భయాన్ని చిత్రీకరించి, సామాజిక మాధ్యమాల్లో పెడుతూ ఉంటారు. ఇవి కొన్ని సందర్భాల్లో సరదాగానే అనిపించినా.. కొన్ని సందర్భాల్లో తీవ్ర భయాన్ని రేపుతాయి. కొన్ని సందర్భాల్లో ప్రమాదాలు సంభవించిన ఉదంతాలూ విన్నాం. ఇదే క్రమంలో ఫ్రాన్స్‌లో అమినే మోజిటో (Amine Mojito) (అసలు పేరు Ilan M) అనే సోషల్‌ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్‌ (influencer).. ప్రాంక్‌ వీడియోలతో అతికి పోయి.. చివరికి జైల్లో పడ్డాడు. ఫేక్‌ సిరంజ్‌తో ఇంజక్షన్‌ (‘syringe prank’) చేస్తున్నట్టు ప్రాంక్‌ చేస్తూ పలు వీడియోలు తీశాడు. దీనికి సంబంధించిన వీడియో టిక్‌టాక్‌ (TikTok), ఇన్‌స్టాగ్రామ్‌లో వైరల్‌ అయింది. ఈ సిరంజ్‌ వీడియోలు దేశవ్యాప్తంగా భయాన్ని రేపడంతో పారిస్‌ క్రిమినల్‌ కోర్టు (The Paris Criminal Court) వేధింపులు, బెదిరింపు తదితర అభియోగాలపై అతడికి 12 నెలల జైలు శిక్ష విధించింది. ఇందులో ఆరు నెలలు ప్రత్యక్ష జైలు శిక్ష ఉండగా.. మిగిలిన ఆరు నెలలు సస్పెండెడ్‌ సెంటెన్స్‌గా ఉంటాయి.

ఇలా చేశాడు..

బహిరంగ ప్రదేశాల్లో ఉన్న జంటలు, లేదా వ్యక్తుల వద్దకు వెళ్లి ఖాళీ సిరంజితో ఇంజక్షన్‌ ఇచ్చినట్టు నటించేవాడు. సిరింజిలో సూది, మందు లేకపోయినా.. ఒక్కసారిగా మాస్క్‌ పెట్టుకున్న వ్యక్తి ఇంజెక్షన్‌ చేయడానికి ప్రయత్నించేసరికి వాళ్లు భయంతో కంపించిపోయారు. కొందరైతే పానిక్‌ అయిపోయారు. ఈ వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అయ్యాయి. అయితే.. వాటిపై తీవ్ర విమర్శలు వచ్చాయి. మోజిటో చర్యలు వేధింపులు, ఉద్దేశపూర్వకంగా రెచ్చగొట్టడం వంటి వాటికిందికి వస్తాయని విచారణ సందర్భంగా ప్రాసిక్యూటర్లు వాదించారు. సామాజికంగా భయం కల్పించేవిధంగా వీడియోలు ఉన్నాయని అన్నారు. ఇప్పటికే అతనికి న్యాయపరమైన చిక్కులు కల్పించిన చరిత్ర ఉందని, వేధింపుల కేసులు కూడా ఉన్నాయని కోర్టు దృష్టికి తెచ్చారు.

తప్పు ఒప్పుకొన్న మోజిటో

తాను చేసిన వీడియోలు వినోదం కోసమేనని సమర్థించుకున్న మోజిటో.. అనంతరం తన చర్యలపై పశ్చాత్తాపం ప్రకటించాడు. సరదాగానే అయినప్పటికీ.. అటువంటి చర్యలు ఎదుటివారిలో ఎంతటి భయాన్ని సృష్టిస్తాయో తనకు అర్థమైందని అంగీకరించాడు. ఎవరైనా అపరిచితులు అకస్మాత్తుగా ఇలా సిరంజ్‌తో వస్తే తాను సైతం భయపడతానని అన్నాడు.

ప్రాంక్ కల్చర్‌పై కొత్త చర్చ

ఈ తీర్పు నేపథ్యంలో ఫ్రాన్స్‌లో ప్రాంక్‌ కల్చర్‌, సోషల మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్‌ల బాధ్యతలపై మరోసారి చర్చ జరుగుతున్నది. సోషల్‌ మీడియా కంటెంట్‌కు ఫ్రీ ఎక్స్‌ప్రెషన్‌ ఉన్నప్పటికీ.. అది ప్రజా భద్రతను ప్రమాదంలోకి నెట్టకూడదని న్యాయ నిపుణులు చెబుతున్నారు. ఆన్‌లైన్‌ ప్రాంక్‌ లపై కఠిన నిబంధనలు తీసుకురావాలన్న వాదనలు కూడా వినిపిస్తున్నాయి. Mojito తన ఆరు నెలల శిక్షను అనుభవించాల్సి ఉంటుంది. అయితే.. దీనిపై అతను అప్పీలుకు వెళ్లేందుకు కూడా కోర్టు అవకాశం ఇచ్చింది.

ఇవి అస్సలు మిస్‌ కావొద్దు..

cute baby viral video | “మాస్టారూ.. మీ టికెట్​ ఏదీ”? హృదయాలను హత్తుకున్న చిన్నారి వీడియో
Pythons Fight Viral Video | రెండు కొండ చిలువల భీకరపోరు! రాను.. ఆస్ట్రేలియాకు రాను..
Beach Bathing Viral Video | బికినీలేసుకుని.. సబ్బు రుద్దుకుంటూ.. కెనడా బీచ్‌లో ‘భారతీయుల’ స్నానంపై ట్రోలింగ్‌
Viral Video | మేత కోసం క‌రెంటు తీగలపైకి ఎక్కిన తెల్ల మేక‌.. వైర‌లైన వీడియో