Pythons Fight | ఆస్ట్రేలియాలో వానాకాలం వచ్చిదంటే చాలు.. పాములు ఎక్కడ పడితే అక్కడ కుప్పలు కుప్పలుగా కనిపిస్తుంటాయి. ప్రత్యేకించి కార్పెట్ పైథాన్స్ ఇంటి చూరుల్లో కంట పడుతుంటాయి. అయితే.. రెండు మగ కొండ చిలువలు వేలాడుతూ ఫైట్ చేసుకుంటున్న ఒక వీడియో ఇప్పుడు నెట్టింట హల్‌చల్ చేస్తున్నది. ఆస్ట్రేలియాలోని క్వీన్స్‌లాండ్‌లో ఈ వీడియో చిత్రీకరించారు. స్నేక్ క్యాచర్ జేక్ స్టిన్సన్ ఈ వీడియోను టిక్‌టాక్‌లో షేర్ చేశారు. ఈయన జేక్స్ రెప్టయిల్ రిలొకేషన్స్ అనే సంస్థను నిర్వహిస్తున్నారు. నివాసాల సమీపానికి వచ్చిన పాములను పట్టుకుని, వాటి సురక్షిత ప్రాంతాల్లో వదిలేస్తూ ఉంటారు.
ఆయన షేర్ చేసిన ఈ ఫుటేజ్‌లో.. దాదాపు పది అడుగుల పొడవు ఉన్న రెండు మగ కొండ చిలువలు ఫైట్ చేస్తూ ఉంటాయి. అదికూడా ఒక ఇంటి చూరు నుంచి కిందికి వేలాడుతూ! రెండు చిలువలూ ఒకదానిపై ఒకటి ఆధిపత్యం సాధించేలా పోరాడుతున్నట్టు కనిపిస్తున్నది. కాసేపటికి ఒక కొండచిలువ జారి కింద పడిపోతుంది. అయినప్పటికీ.. పై నుంచి వేలాడుతున్న మరో కొండ చిలువను అందుకుని, దాడి చేయాలన్న కసితో.. చూస్తూ ఉంటుంది. కాసేపటికి చూరుపై వేలాడుతున్న కొండ చిలువు.. తిరిగి తన స్థానంలోకి వెళ్లిపోతుంది. ‘అవి చాలా భారీగా ఉన్నాయి. ఎంత పొడవుతో, ఎంత మందంతో ఉండాలో.. అంతలా ఉన్నాయి’ అని స్టిన్సన్ న్యూస్‌వీక్‌కు చెప్పారు. ‘అవి అలా ఫైట్ చేస్తుండటం చూస్తే ముచ్చటేస్తున్నదని పేర్కొన్నారు. ఇదొక అద్భుతమైన దృశ్యమని అన్నారు. పోరాడే క్రమంలో వీటి శబ్దాలు కూడా అపూర్వమని చెప్పారు. దీర్ఘంగా బుసలు కొడుతుంటే.. లారీ ఇంజిన్ ఆపినప్పుడు బుస్.. అని వచ్చే శబ్దంలా ఉందని తెలిపారు.
ఇది పాముల బ్రీడింగ్ సీజన్. ఈ సమయంలో ఆడ పాములను వెతికే క్రమంలో మగ పాములు చాలా దుండుకుగా ప్రవర్తిస్తాయట. కార్పెట్ పైతాన్‌లు ఆకర్షణీయమైన డిజన్లను కలిగి ఉంటాయి. ఇవి విష రహితాలు. కనీసం మూడు మీటర్ల పొడవు వరకూ పెరుగుతాయి. ఆస్ట్రేలియా ఇళ్ల చూరుల్లో ఇవి నిత్యం కనిపిస్తూ ఉంటాయి. క్వీన్స్‌లాండ్‌లోని ప్రతి మూడు ఇళ్లలో ఒక దాని చూరులో ఇవి కనిపిస్తాయని క్వీన్స్‌లాండ్ మ్యూజియం పేర్కొంటున్నది. మానవ ఆవాసాల్లోకి సహజంగా చొచ్చుకుపోతాయని తెలిపింది. వీటి బెడద నివారణకు క్వీన్స్‌లాండ్‌లో ఇంటిపై పాములను తనిఖీ చేయడం అనేది ఒక భద్రతా నిబంధన.
ఈ వీడియోను చూసిన నెటిజన్లు.. రాను.. ఆస్ట్రేలియాకు రాను.. అంటూ పాటలు పాడుతున్నారు. కొందరైతే ఇంటి చూర్లలో, ఫాల్‌సీలింగ్‌లో దాగిన పాముల వీడియోలను, గోల్ప్ క్లబ్‌లో దూసుకొస్తున్న కోబ్రా వీడియోను.. పంచుకున్నారు. ఒక్కో వీడియో.. ఒక్కో రేంజ్‌లో ఉంది.. మీరూ వాటిపై ఒక లుక్కేయండి..
కొండ చిలువల ఫైట్..
It’s official, I’m never coming to Australia pic.twitter.com/PwxGx8icAI
— Nature is Amazing ☘️ (@AMAZlNGNATURE) August 2, 2025
గోల్ఫ్ కోర్స్‌లో కోబ్రా
Cobra on a golf course fleeing from a mongoose 😲🥺 pic.twitter.com/DqlqiOLJSI
— Siyaram Mirotha (@SiyaramMirotha) August 2, 2025
ఇంటి ఫాల్‌సీలింగ్‌లో చిలువలు
Me too pic.twitter.com/Pg6nY0DAbK
— Merih Atilla ⚫️ (@MerihAtilla) August 2, 2025
కుబుసం విడుస్తున్న పాము
Brazilian Rainbow Boa Shedding a Snake Skin Sock Incident.
©️therealtarzannpic.twitter.com/ipTPVsHMyD
— Ammim 👸 (@Ammim_) August 2, 2025