Site icon vidhaatha

Viral news | ఎస్కలేటర్‌పై మహిళల తిప్పలు.. ఈ వీడియో చూసి నవ్వకుండా అస్సలే ఉండలేరు..!

Viral news : ప్రతి ఒక్కరికీ మొబైల్ అందుబాటులోకి రావడంతో ప్రపంచం అరచేతిలో ఒదిగిపోయింది. దాంతో సోషల్ మీడియా వేదికగా నిత్యం రకరకాల వీడియోలు వైరల్ అవుతుంటాయి. వాటిలో కొన్ని షాకింగ్‌గా ఉంటే.. మరికొన్ని ఆశ్యర్యకరంగా ఉంటాయి. కొన్ని భయపెట్టేవిగా ఉంటే మరికొన్ని నవ్వు తెప్పించేవిగా ఉంటాయి. అలాంటిదే ఓ ఫన్నీ వీడియో ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

ఓ ఇద్దరు మహిళలు మెట్రో స్టేషన్‌ ఎస్కలేటర్‌లోకి ఎక్కి పడిపోతామనే భయంతో నానాపాట్లు పడ్డ తీరు తెగ నవ్విస్తున్నది. నిలబడితే పడిపోతామనే భయంతో వాళ్లు వంగి చేతులు కిందపెట్టి పైకి రావడం ఫన్నీగా ఉంది. పడుతూ లేస్తూ వాళ్లు ఎస్కలేటర్‌లో పైకి వచ్చిన వీడియో చూసే వాళ్ల ముఖాల్లో నవ్వులు పూయిస్తోంది.

ఈ హిలేరియస్‌ వీడియోను ఇప్పటి వరకు 7 లక్షలకు పైగా నెటిజన్‌లు వీక్షించారు. కొన్ని వేల మంది లైక్‌ చేశారు. ఈ వీడియోపై నెటిజన్‌లు రకరకాల కామెంట్‌లు చేస్తున్నారు. చిన్నప్పుడు నేను మొదటిసారి షాపింగ్‌ మాల్‌కి వెళ్లింది గుర్తుకొస్తోంది అని ఓ నెటిజన్‌ స్పందిస్తే.. అమ్మో.. గతం గుర్తుకొస్తోంది అంటూ మరో నెటిజన్‌ కామెంట్‌ చేశాడు. ఈ వైరల్‌ వీడియోపై మీరూ ఓ లుక్కేయండి..

Exit mobile version