Site icon vidhaatha

మోహిని అవతారంలో దర్శనం ఇచ్చిన శ్రీవారు

విధాత : తిరుమల శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాల్లో ఐదవ రోజు గురువారం ఉదయం మోహినీ అవతారంలో శ్రీదేవి, భూదేవి సహితంగా మలయప్ప స్వామి భక్తులకు దర్శనమిచ్చారు. సాయంత్రం గరుడ వాహనంపై స్వామివారు తిరు మాడ వీధుల్లో విహరించారు.



భక్తులు స్వామివారి గరుడ వాహన ఊరేగింపును తిలకించేందుకు భారీగా తరలివచ్చారు. స్వామివారిని దర్శించుకున్న భక్తులు గోవింద నామస్మరణలతో భక్తీ తన్మయత్వంతో పులకించారు.

Exit mobile version